కరోనా సెకండ్ వేవ్‌ : భారీ నియామకాలకు జగన్ గ్రీన్‌సిగ్నల్‌- భర్తీ చేసే ఉద్యోగాలివే

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు వెయ్యి అదనపు కేసుల చొప్పున పెరిగిపోతూ ఉండటంతో ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్ధితి. దీంతో గతేడాది ప్రారంభించి ఆ త తర్వాత పట్టించుకోని కోవిడ్‌ ఆస్పత్రులను తిరిగి దుమ్ముదులపడంతో పాటు భారీ ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలో ఈ నియమాకాలు పూర్తి చేయడం ద్వారా కోవిడ్‌ ఆస్పత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

 ఏపీలో తాజా కరోనా పరిస్ధితి ఇదే

ఏపీలో తాజా కరోనా పరిస్ధితి ఇదే

ఏపీలో కరోనా కేసుల విజృంభణ ఆదివారం కూడా కొనసాగింది. నిన్న ఒక్క రోజు 12 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కేసుల కట్టడికి ఉన్న అన్నిమార్గాలను అన్వేషిస్తోంది. పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు మన రాష్ట్రం నుంచి రాకపోకలపై ఆంక్షలు కూడా విధిస్తున్న పరిస్ధితి. దీంతో తక్షణం ఏదో రకంగా కేసుల్ని నియంత్రించక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. దీంతో ఓవైపు టెస్టుల సంఖ్య పెంచుతూనే మరోవైపు కోవిడ్ సౌకర్యాలు మెరుగుపర్చేందుకు వీలుగా అదనపు సిబ్బంది నియామకానికి సిద్దమైంది.

భారీగా నియామకాలు

భారీగా నియామకాలు

కోవిడ్ రెండో దశ ఎదుర్కొనేందుకు భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కొత్త కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో అదనపు సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు ఇచ్చారు. ఇకపై కోవిడ్‌తో బాధపడుతున్న రోగులకు పూర్తి స్ధాయిలో వైద్యసేవలు అందించేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

నియమించే పోస్టులివే

నియమించే పోస్టులివే

రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ఆస్పత్రుల్లో 1170 స్పెషలిస్టు డాక్టర్లు, 1170 జనరల్‌ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు 2 వేల మంది స్టాఫ్‌ నర్సులు, 300 మంది అనస్తీషియా టెక్నీషియన్ల నియమకానికి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 300 మంది ఎమ్‌ఎన్‌వోలు, 300 స్వీపర్ల నియామకానికి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో కొరత భారీగా తీరనుందని అంచనా వేస్తున్నారు.

తాత్కాలిక నియామకాలు

తాత్కాలిక నియామకాలు

ఈ అదనపు పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదిక మీదే ప్రభుత్వం నియమించబోతోంది. వీరికి ఆరు నెలల పాటు ప్రభుత్వం ప్రత్యేక వేతనాలలు చెల్లించి వీరి సేవల్ని పొందనుంది. గతంలోనూ కోవిడ్‌ సందర్భంగా ప్రభుత్వం ఇలాగే భారీ ఎత్తున సిబ్బందిని నియమించుకుంది. ఈసారి కూడా అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవడం ద్వారా ఆరు నెలల్లో పరిస్ధితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావాలని భావిస్తోంది. జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రుల వారీగా ఈ నియామకాలు జరిగే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+