ఏపీ వాలంటీర్లకు కూటమి సర్కార్ మరో షాక్ ! తాజా ప్రతిపాదనలివే..?
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన వాలంటీర్ల వ్యవస్ధలో భారీ మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం అంతర్గంతంగా కసరత్తు సాగుతోంది. ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లకు ఇచ్చే జీతం 5 వేల నుంచి 10 వేలకు పెంచాల్సిన పరిస్దితి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో మార్పులు పూర్తి చేసి జీతాల పెంపుపై నిర్ణయం తీసుకునే దిశగా కూటమి సర్కార్ అడుగులేస్తోంది.
రాష్ట్రంలో వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు 2.67 లక్షలు. వీరిలో దాదాపు లక్షకు పైగా ఇప్పటికే రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వీరి సంగతి ఏమో కానీ మిగిలిన వాలంటీర్లకు కూడా పని లేకుండా పోయింది. ఇప్పటికే ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సంక్షేమ పథకాలు అందుతాయన్న విషయాన్ని లబ్దిదారులకు చెప్పేందుకు సచివాలయ కార్యదర్శుల్ని వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉన్న వాలంంటీర్ల పరిస్దితి అగమ్య గోచరంగా మారింది.

ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్ధలో తగు మార్పులు చేసి వీరి జీతాల పెంపుపై ఫోకస్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం మొత్తం రాజీనామా చేసిన వాలంటీర్లతో కలిపి మొత్తం 2.67 లక్షల వాలంటీర్లను సగానికి సగం తగ్గించడంతో పాటు వీరికి అప్పగించే విధుల్లోనూ, వీరి పేర్లలోనూ మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ 50 ఇళ్లకో వాలంటీర్ ఉండగా.. ఇకపై 100 ఇళ్లకో వాలంటీర్ ఉండేలా చూస్తారు.
అలాగే వాలంటీర్ల పేర్లను కూడా గ్రామ సేవక్, వార్డ్ సేవక్ గా మార్పబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే రాజీనామా చేసిన వారికి చాన్స్ లేనట్లేనని చెప్తున్నారు. 3 ఏళ్లు మాత్రమే ఉద్యోగం ఉండేలా నిబంధనలు పెట్టబోతున్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు మార్పులు చేసి వీరి సేవల్ని వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications