ఏపీలో 37 మంది ఐపీఎస్ ల బదిలీ, పోస్టింగ్ లు-ఎవరెవరికి ఎక్కడంటే ?
ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల్ని బదిలీలు చేసింది. ఇందులో పలు జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులతో పాటు పలువురు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులు కూడా ఉన్నారు. ఇవాళ బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల జాబితా ఇలా ఉంది.

రంపచోడవరం ఓఎస్డీగా ఉన్న ఐపీఎస్ కేవీ మహేశ్వర రెడ్డిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా నియమించారు. బాపట్ల ఎస్పీ వకుళ్ జిందాల్ ను విజయనగరం ఎస్పీగా బదిలీ చేశారు. విజయనగరం ఎస్పీగా ఉన్న ఎం దీపికను అనకాపల్లి ఎస్పీగా పంపారు. ఏపీఎస్పీ మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్ గా ఉన్న వి రత్నను సత్యసాయి జిల్లా ఎస్పీగా పంపారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డిని పార్వతీపురం జిల్లా ఎస్పీగా పంపారు. అక్కడ ఉన్న విక్రాంత్ పాటిల్ ను కాకినాడ ఎస్పీగా బదిలీ చేశారు.
కాకినాడ ఎస్పీగా ఉన్న సతీష్ కుమార్ ను గుంటూరు ఎస్పీగా మార్చారు. గుంటూరు ఎస్పీగా ఉన్న తుషార్ డూడీని బాపట్ల ఎస్పీగా పంపారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అమిత్ బర్దార్ ను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా నియమించారు. అక్కడ ఎస్పీగా ఉన్న తుహిన్ సిన్హాను విశాఖపట్నం డీసీపీ 2గా బదిలీ చేశారు. టీటీడీ విజిలెన్స్ ఛీఫ్ గా ఉన్న నరసింహ కిషోర్ ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పంపారు. బి.కృష్ణారావును అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా పంపారు. సీఐడీ ఎస్పీ గంగాధర్ రావును కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ చేసారు.
కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూం అస్మీని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పంపారు. పశ్చిమ గోదావరి ఎస్పీ అజిత వేజెండ్లను విశాఖ డీసీపీ 1గా నియమించారు. చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ను ఏలూరు ఎస్పీగా నియమించారు. జగ్గయ్యపేట డీసీపీ శ్రీనివాసరావును పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించారు. పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ను విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా పంపారు. పీటీసీ ప్రిన్సిపాల్ గా ఉన్న ఏఆర్ దామోదర్ ను ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బిందు మాధవ్ ను కర్నూలు ఎస్పీగా నియమించారు.
కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ను నెల్లూరు ఎస్పీగా పంపారు. ఎన్డీఆర్ పోలీసు కమిషనరేట్ లో డీసీపీగా ఉన్న అధిరాజ్ సింగ్ రాణాను నంద్యాల ఎస్పీగా నియమించారు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కడప ఎస్పీగా పంపారు. అనంతపురం ఎస్పీగా కేవీ మురళీకృష్ణను నియమించారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ లో లా అండ్ ఆర్డర్ డీసీపీగా గౌతమీ శాలిని బదిలీ చేశారు. ఎల్ సుబ్బారాయుడుని తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్ గీతా దేవిని ఇంటెలిజెన్స్ అడ్మిషన్ ఎస్పీగా బదిలీ చేశారు. జిఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, రఘువీరారెడ్డి సిద్ధార్ధ్ కౌశల్, గరుడ్ సుమిత్ సునీల్, జగదీష్, శ్రీధర్, సత్తిబాబులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications