• search

అరకు కాఫీ తరహాలో పాడేరు పనస వ్యాపారం...ప్రాజెక్ట్ రూపకల్పనలో గిరిజన శాఖ అధికారులు

By Suvarnaraju
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విశాఖపట్టణం:ఏజెన్సీ ఏరియాల్లో ఇప్పటి వరకు కాఫీ, తేనె, చింత పండు వంటి వివిధ రకాల అటవీ ఉత్పత్తులతో వ్యాపార లావాదేవీలు సాగిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కొత్త వ్యాపారం పై దృష్టి సారించింది. అది పనస పళ్ల వ్యాపారం.

  పనసకు బయట మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటం గమనించిన ఏపి ప్రభుత్వం ఈ బిజినెస్ పై దృష్టిసారించింది. ఈ మేరకు షెడ్యూల్డ్‌ ఏరియాలోని పాడేరుతో సహా ఇతర ఐటిడిఏ పరిధిలో పనస వ్యాపారానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టును రూపొందించే పనిని ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించగా వారు ఆ పనిలో తలమునకలై ఉన్నారని తెలుస్తోంది.

  AP government will add another product to the forest products business for Tribal welfare

  పనస పళ్లకు రాష్ట్రంలోనే కాకుండా బయట మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు గిరిజన శాఖ అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా పండే అటవీ ఫలాల్లో పనస కూడా ఒకటి. అయితే ఈ పంటను పట్టించుకోకుండా అలా వదిలేయడం కాకుండా దీని ద్వారా కూడా గిరిజనులకు జీవనోపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన ప్రాజెక్టును చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

  అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి రూపుదిద్దుకోలేదని...అందువల్ల దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అప్పుడే చెప్పలేమని అధికారులు అంటున్నారు. అయితే గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ( జిసిసి ), గిరిజన ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ( ట్రైకార్‌ )ల ఆధ్వర్యంలో దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు.

  అయితే ఈ వ్యాపారానికి మోడల్ గా కేరళ ను తీసుకొని ఆ తరహాలో ఎపిలో కూడా పనస వ్యాపారం చేపట్టాలని ప్రాధమికంగా గిరిజన శాఖ అధికారులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అక్కడ దీనిని ఏ విధంగా నిర్వహిస్తున్నారనే అంశం పై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర గిరిజన సంక్షే శాఖ అధికారుల బృందం ఇటీవలే రకే కేరళ పర్యటనకు సైతం వెళ్లినట్లు తెలిసింది.

  అంతేకాదు పనస పళ్లను కేవలం తినేందుకే కాకుండా, పనస కాయతో అప్పడాలు, పచ్చడి వంటి విభిన్న ఆహార ఉత్పత్తులు, అలాగే వ్యర్థాలను సద్వినియోగం చేయడం చేయవచ్చని అధికారులు యోచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 2లక్షల నుంచి 2.50 లక్షల పనస చెట్లు ఉన్నాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే పాడేరుతో పాటు తక్కిన ఐటిడిఏల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఒక్కో చెట్టు కు సగటున ఎన్ని ఫలాలొస్తున్నాయనే అంశంపై ప్రస్తుతం సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. వీటిపై పూర్తి స్థాయి నివేదిక అందగానే పాడేరు కేంద్రంగా పనస ప్రాజెక్టును ప్రారంభించే అవకాశముంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Visakhapatnam: The AP government has ready to introduced another product to help the tribals in the forest products business like coffee, honey and tamarind. That is Jackfruit.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more