మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కారు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వయోపరిమితి పెంపు ఈ మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కటాఫ్ తేదీని 2024, జులై 1గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 ఖాళీలు ఉండనున్నాయి. ఇక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉన్నాయి.

AP government s good news for Mega DSC candidates Age limit increased

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చునని తెలిపింది. అయితే, విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)ని హైకోర్టు ఆదేశించింది.

ఇటీవల వెల్లడించిన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్‌ను సవాల్ చేస్తూ 20 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీఆర్‌ఎల్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. మెయిన్స్ పత్రాల మ్యూల్యాంకనం సరిగా నిర్వహించలేదని, అందుకే అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు.

మూల్యాంకనం, నియామకాలు నిబంధనలకు నిబంధనలకు విరుద్ధమని, తిరిగి మూల్యాంకనం చేయాలన్నారు. లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనం హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు ప్రతివాదులను ఆదేశించాలని 20 మంది గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును అభ్యర్థించారు.

తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, నియామక పత్రాలు మాత్రం విచారణ పూర్తయ్యే వరకు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+