తాజా సర్వేలు తేల్చిందిదే, రిపేర్ కొనసాగుతుంది - సజ్జల..!!
వైయస్‌ఆర్ మరణించినా ఆయన పాలన ఆగలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ రూపంలో వైయస్‌ఆర్ ఉన్నారన్నారు. ఈతరం యువత సీఎం వైయస్ జగన్ తండ్రి వైయస్‌ఆర్ అని గర్వంగా చెప్పుకునేలా పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ పాలన మన కళ్లముందే మరింత మెరుగ్గా ఉందన్నారు.
జగన్ సువర్ణ పాలన అందిస్తున్నారని సజ్జల వివరించారు. జగన్ రూపంలో ఆరోజు నుంచి ఆ అడుగులు మరింత బలంగా పడుతూ వస్తున్నాయని చెప్పారు. వైయస్‌ఆర్ మంచితనం, ప్రేమ, దార్శనికత, ప్రతి లక్షణం మరింత మెరుగ్గా, పదునుగా, ప్రేమపూర్వకంగా సీఎం వైయస్ జగన్ ద్వారా చూస్తున్నామని వివరించారు. ఘనమైన నాయకుడి వెనుక అడుగులు వేస్తున్నాం..

ఇందుకు మనందరం కాలర్ ఎగరేసుకొని వైయస్‌ఆర్ కుటుంబ సభ్యులమని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. జగన్ వేస్తున్న అడుగులు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా ఉన్నాయన్నారు. మంచి పాలన, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఐదేళ్లలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలబడే గట్టి పునాదులు ఇప్పటికే పడ్డాయని కీలక వ్యాఖ్యలు చేసారు.
అన్ని వ్యవస్థలను సీఎం జగన్ రిపేర్ చేస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలను సీఎం జగన్ వందకు 200 శాతం, నిబద్ధతతో, దార్శనికతతో అమల్లోకి తీసుకువచ్చి రిజల్ట్ చూపిస్తున్నారన్నారు. ఏ సర్వే చేసినా 70 నుంచి 80 శాతం మంది మాకు జగనన్నే కావాలి.. ఆయనే ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా పరిపాలించాలని చెబుతున్నారని వివరించారు.
మా బతుకులు ఆయన చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటాయని అంటున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన 1.40 కోట్ల మందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబెట్టేలా ముందుకుసాగాలని సజ్జల అన్నారు. వైఎస్సార్ జన్మదినం సందర్బంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications