'అన్నదాత సుఖీభవ' లో వీరికి కోత, అర్హుల జాబితాలో - 13వ తేదీ తుది గడువు..!?
ఏపీ ప్రభుత్వం మరో ప్రధాన పధకం అమలుకు ప్రభుత్వం సిద్దమైంది. పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం అమలుకు సిద్దమైంది. అధికారికంగా మార్గదర్శకాలు ప్రకటించకపోయినా.. అర్హుల జాబితా వెల్లడించింది. రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచారు. అన్నదాత సుఖీభవ పోర్టల్లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే, పది సెంట్ల సాగు భూమి ఉన్న వారికే అర్హత గా గుర్తించారనే సమాచారంతో ఈ నిబంధన తొలిగింపు కోసం రైతులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు.
అర్హత జాబితా సిద్దం
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్దమైంది. అర్హులైన రైతుల జాబితా లను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని పేర్కొంది. కాగా, మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పిం చారు. ఆధార్ నెంబర్‌ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయి. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

వీరికి దక్కేనా
'అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబా లను అర్హులుగా గుర్తించారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98% మందికి ఈకేవైసీ పూర్తి చేసారు. కాగా, పథకం లబ్ధికి అర్హత పొందాలంటే రైతుకు కనీసం పది సెంట్ల సాగు భూమి ఉండాలని కొత్త నిబంధనను ముందుకు తెచ్చిందని ప్రచారం సాగుతోంది. రెవెన్యూ రికార్డుల్లో రైతుల హక్కు భుక్తము లలో పది సెంట్ల భూమి ఉండి, దానిలో పంటలు సాగు చేస్తున్నట్లుగా ధ్రువీకరణ జరిగితేనే ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయానికి అర్హులని చెబుతున్నారు. పేద రైతు కుటుంబాలు అరెకరా ఎకరౌను పంచుకుంటే పది సెంట్ల లోపు భూమి వాటాగా వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో ఈ సమాచారం పైన రైతులు స్పష్టత కోరుతున్నారు. ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతీ రైతుకు పథకం అమలు చేస్తామని హామీ ఇస్తోంది.
అధికారుల స్పష్టత
కాగా, వ్యవసాయ అధికారులు కీలక ప్రకటన చేసారు. సొంతభూమి కలిగిన డీ.పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ జత కాకున్నా, తప్పుగా జోడించినా, చనిపోయిన ఖాతాలు, నోషనల్ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం వారికి కూడా ఈ సుఖీభవ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు స్వీకరించేందు కు త్వరలో అన్నదాతా సుఖీభవ పోర్టల్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ నెల 18 లేదా 20వ తేదీన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం నిధులు జమ అయ్యేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications