Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

175 నియోజకవర్గాలకు ర్యాంకుల ప్రకటన, ఎవరు ఏ స్థానంలో...!!

ఏపీ ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ర్యాంకులు ప్రకటించింది. ప్రధాన ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకులు ప్రకటించారు. కూటమి ఎమ్మెల్యేలు 164 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనేక కేటగిరీల వారీగా పలు అంశాల పైన నియోజకవర్గాల్లో పని తీరు ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేసారు. ర్యాంకులను అధికారుల సమక్షంలో వెల్లడించటం ద్వారా రానున్న రోజుల్లో తీసుకురావాల్సిన మార్పులు... చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.

మంత్రులు.. అధికారులతో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాల పైన ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే... దిశా నిర్దేశం చేసారు. అదే సమయంలో వివిధ అంశాల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాలకు ర్యాంకులు ప్రకటించారు. వివిధ ఇండికేట‌ర్లను దృష్టిలో పెట్టుకోని ర్యాంకులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... ఏ నియోజవకర్గం ఏ స్థానంలో ఉందో స్పష్టత ఇచ్చింది.

AP govt announces gradings for 175 Assembly Constituencies based on Indicators performance details here

మొత్తం 175 ఎమ్మెల్యే నియోజ‌కవ‌ర్గాల్లో ఏ ప్లస్ గ్రేడ్ లో 21న నియోజ‌క వ‌ర్గాలు ఉన్నాయి. కాగా, ఏ గ్రేడ్ లో 153.. బి గ్రేడ్ లో ఒక నియోజ‌క వ‌ర్గం ఉన్నట్లు వెల్లడించారు. కాగా, 90 శాతానికి పైగా మార్కుల సాధించి ఏ ప్ల‌స్ గ్రేడ్ ద‌క్కించుకున్న 13 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నట్లు వివరించారు. 93 శాతం మార్కులు సాధించిన రాష్ట్రంలోనే నెంబ‌ర్ ఒన్ స్థానంలో ఎన్టీఆర్ జిల్లాలోని సుజ‌నా చౌద‌రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గం నిలిచింది.

అధికారులకు దిశా నిర్దేశం

కాగా, 92 మార్కులు సాధించి రెండో ర్యాంకు విశాఖ ప‌ట్నంలోని గాజువాక‌ సాధించింది. ఇక.. 3వ ర్యాం ర్యాంకు కాకినాడ న‌గ‌ర నియోజ‌క వ‌ర్గం కు దక్కింది. 4వ ర్యాంకు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క వ‌ర్గం కు వచ్చినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాల పైన అప్రమత్తం చేసారు. వేసవి కాలం రానున్న నేపథ్యంలో నీటి ఎద్దడి అనేది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంతోపాటు... పశువుల దాణాకూ సమస్యలు రాకూడదని సీఎం చెప్పారు.

మరోవైపు ప్రజాసమస్యలు-పాలనా తీరు తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే దానిని ప్రత్యక్షంగా చూడాలన్నారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా... క్షేత్ర స్థాయిలో పాలసీలు సమర్ధవంతంగా అమలు కానప్పుడు ఆశించిన ఫలితాలు రావని సీఎం అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+