ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు - రీ ఓపెనింగ్ షెడ్యూల్ ఇలా..!!
ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవుల పైన ప్రకటన చేసింది. ఈ రోజు ఇంటర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ సమయంలో పాఠశాలలకు సెలవులతో పాటుగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ...ప్రయివేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు ఈ నెల 27 తో పరీక్షలు ముగియనున్నాయి. దీంతో, ఈ నెల 29 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 29 నుంచి వేసవి సెలవులు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. చివరి రోజున చివరి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్ధుల పేరెంట్స్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అదే విధంగా జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహూర్తంగా ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు.

ఇంటర్ పరీక్షకు మొత్తం విద్యార్థులు 4 .84 లక్షల మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం 5 .19 లక్షల మంది హాజరు అయ్యారు. ఇప్పటికే ఏప్రిల్ 25 నుంచి తెలంగాణలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించగా.. ఇప్పుడు ఏపీలో సెలవుల పైన చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశం పైన స్పష్టత ఇచ్చింది. ఇక, వేసవి ఈ సారి తీవ్రత మరింతగా పెరుగుతోంది. దాదాపుగా 45 రోజుల వరకు వేసవి సెలవులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. డ్రాపవుట్స్ లేకుండా విద్యార్ధుల సంఖ్య పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. జూన్ మాసంలో ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్లు కూడా జూన్ 1 నుంచి మొదలవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications