సోమేశ్ కు ఏపీ ప్రభుత్వం జాక్ పాట్ - మరో వివాదం..!!
సోమేశ్ కుమార్. సీనియర్ ఐఏఎస్ అధికారి. తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. ఆ తరువాత కోర్టు ఆదేశాలతో ఏపీకి రిపోర్టు చేసారు. కానీ, ఒక్కరోజు కూడా పని చేయలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో వీఆర్ఎస్ తీసుకొని సర్వీసు నుంచి వైదొలిగారు. తెలంగాణలో సలహదారుగా పని చేసారు. ఇక, ఇప్పుడు సోమేశ్ కుమార్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం అధికారిగా రావాల్సిన ప్రయోజనాలను చెల్లిస్తోంది. వ్యవహారం అధికార వర్గాల్లో చర్చగా మారింది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో
ఐఏఎస్ అధికారిగా సోమేశ్ కుమార్ పూర్తిగా తెలంగాణలోనే పని చేసారు. సర్వీసు నిబంధనల ప్రకారం ఎక్కడ పని చేస్తే అధికారిగా రావాల్సిన అన్ని ఆర్దిక ప్రయోజనాలు అక్కడి నుంచే అందుకోవాలి. అదే విధంగా సోమేశ్ కు సంబంధించిన వైద్య, రిటైర్మెంట్ ప్రయోజనాలు తెలంగాణ నుంచి పొందాల్సి ఉంది. తాజాగా సోమేశ్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వం రూ.3 లక్షల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమేశ్‌కుమార్ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఒక్క రోజు కూడా పని చేయలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్ చేసారు.

ఒక్క రోజు పని చేయకుండా
ఇప్పుడు సోమేశ్ కు ఏపీ ప్రభుత్వ చెల్లింపుల వ్యవహారంలో కొత్త చర్చ మొదలైంది. సోమేశ్ కుమార్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించారు.కానీ, సోమేశ్ తెలంగాణలోనే కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తరువాత ఈ వ్యవహారం న్యాయస్థానకు చేరింది. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఏపీ కేడర్‌కు నియమితులైన సోమేశ్‌కుమార్ ఆ రాష్ట్రానికి వెళ్లాలని ఆదేశించింది. దీంతో, సోమేశ్ 2023, జనవరిలో ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వాలంటరీ రిటైర్మెంట్(వీఆర్‌ఎస్) తీసుకుని వెళ్లిపోయారు.
ప్రభుత్వం చెల్లింపులు
ఏపీలో ఆయన పూర్తిగా ఒక్క రోజు కూడా పని చేయలేదు. వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసిన వెంటనే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఆ తరువాత ఆయన తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీలో పని చేయని సోమేశ్‌కుమార్‌కు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం లక్షల రూపాయిలు చెల్లించటం పైన అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పెన్షన్, ఇతర బెనిఫిట్స్ మొత్తం ఏపీనే ఇవ్వాల్సి ఉంది. అయితే, సర్వీసు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో..ప్రభుత్వం ఈ విషయంలో తిరిగి పరిశీలన స్తుందా.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications