ఉద్యోగుల డీఏల పెండింగ్..విడుదల వెనుక, సొమ్మొకడిది... సోకొకడిది..!!
ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న ఆర్దిక సమస్యలను ఉద్యోగులతో నేరుగా సీఎం చంద్రబాబు పంచుకున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉద్యోగుల కోసం దీపావళి కానుకగా ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తమతో కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించటం పైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి. ఇదే సమయంలో అసలు నాలుగు డీఏలు పెండింగ్ కు కారణం ఎవరు.. వైసీపీ హయాంలో జరిగిందేంటి అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చ మొదలైంది.
ఏపీలో ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి. అందులో ఒకటి దీపావళి కానుకగా విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 2024 జనవరిలో ఇవ్వాల్సిన డీఏ సైతం పెండింగ్ లో ఉంది. 2024 జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉంది. అయితే, 2024 జనవరి డీఏ కు సంబంధించి 2024 మార్చిలో ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల్లో అతి తెలివిగా చెల్లింపులను మాత్రం మే 1, 2024 మరియు ఆగస్టు 1, 2024 తేదీల్లో చేయాలని పేర్కొంది. ఎన్నికలు.. ప్రభుత్వం మారటంతో ఉత్తర్వులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చినా.. DA అమలు, చెల్లింపు ఆర్థిక భారం మాత్రం తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం భరించవలసిన పరిస్థితి వచ్చింది. దీని కారణంగా కూటమి ప్రభుత్వం పైన భారీ మొత్తంలో భారం పడింది.

వైసీపీ నేతలు తాము ఇచ్చిన జీవో గురించి చెబుతున్నారు. అయితే, విడుదల గురించి అందులో ప్రస్తావించిన తేదీల గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఇక.. ఇప్పుడు మరో డిఏ ఇవ్వాలంటే, ప్రతి సంవత్సరం సుమారు ₹2,000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. వాస్తవానికి, 15 నెలల కాలం లో మొత్తం మూడు డిఏల భారం కూటమి ప్రభుత్వంపై పడుతోంది. అయినా ఈ విషయం ఎక్కడ ప్రస్తావించకుండా... ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఉద్యోగ సంఘాల నాయకుల దృష్టికి తీసుకుని వచ్చి.. కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకొందామని సీఎం చంద్రబాబు వివరించారు. ఉద్యోగులకు వాస్తవాను వివరించి డీఏ, హెల్త్ కార్డుల అంశాలపై నిర్ణయం ప్రకటించారు. ఆర్దికంగా సమస్య ఉన్నా.. ఉద్యోగులకు ఇస్తున్న ప్రాధాన్యత వివరిస్తూ స్నేహ పూర్వకంగా వారితో హుందాగా వ్యవహరించి తన అనుభవంతో వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇక, హామీ ఇచ్చిన విధంగా ఒక డీఏ చెల్లింపు పైన జీవో విడుదల చేసారు.












Click it and Unblock the Notifications