మరో డీఎస్సీ నోటిఫికేషన్, ఖాళీల లెక్కలు - టెట్ ముహూర్తం ఫిక్స్..!!

ఏపీ ప్రభుత్వం మరో డీఎస్సీ నిర్వహణకు నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నిర్వహణ పూర్తి చేసి.. కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరే విధంగా ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందు కోసం ఖాళీల గుర్తింపు.. షెడ్యూల్ పైన ప్రస్తుతం విద్యా శాఖ సమాయత్తం అవుతోంది. ఇక.. టెట్ పరీక్ష నిర్వహణ పైన ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో, మరోసారి పెద్ద సంఖ్యలో టీచర్ల పోస్టులు భర్తీ కానున్నాయి.

ఏపీ ప్రభుత్వం మరో డీఎస్సీ నిర్వహణకు నిర్ణయించింది. ఇందు కోసం జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తోంది. దీంతో ముందుగా టెట్‌ నిర్వహణకు చర్యలు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేయనుంది. అయితే, ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి టెట్‌కు అర్హతల విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి(ఎన్‌సీటీఈ) నిబంధనలను పాటించాలని నిర్ణయించారు. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు, ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనలనే అమలు చేయనున్నారు. సుదీర్ఘకాలం నుంచి టెట్‌లో ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి.

ap-govt-begin-exercise-on-another-dsc-to-fill-nearly-2000-teacher-posts

దీంతో, ప్రతిసారీ డీఎస్సీ నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి నిబంధనలను పూర్తిగా ఎన్‌సీటీఈ తరహాలోకి మార్చి, తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. అలాగే జనవరిలో ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్‌లో సుమారు రెండు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది. స్పెషల్‌ డీఎస్సీ పోస్టులు వెయ్యి, మెగా డీఎస్సీ-2025లో మిగిలిన పోస్టులు 406, ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఖాళీలు పెరిగినా విద్యార్థుల సంఖ్యను కూడా భర్తీకి ప్రామాణికంగా తీసుకుని తుది నిర్ణయం వెల్లడించనున్నారు. జూన్ లో తిరిగి పాఠశాలలు ప్రారంభం నాటికి డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+