ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ - మరో హామీ అమలు..!!

ఏపీ ప్రభుత్వం ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. దాదాపు రూ 4,497 కోట్ల మేర ప్రజల పైన భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రానున్న రోజుల్లో మరింతగా భారం తగ్గించేలా ప్రణాళికలు సిద్దం చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఇంటి పైన భారం తగ్గనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా అధికారిక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చే నిర్ణయం అమలు చేయనుంది. సుమారు రూ 4,497.89కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని జనం పైన మోపకుండా.. ఆ మొత్తం ప్రభుత్వమే భరించాలని డిసైడ్ అయింది. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశా కసరత్తు వేగవంతం చేసింది. రాబోయే 3 ఏళ్లలో అనగా 2029 నాటికి విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని యూనిట్​కు రూ.4 లోపు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు వ్యయం రూ.5.19గా ఉండేదని అన్నారు. దాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4.90కు తగ్గించామని చెప్పారు.

ap-govt-big-decision-over-power-true-up-charges-becomes-big-relief-for-consumers

కాగా.. కొనుగోలు వ్యయం యూనిట్‌కు 29 పైసలు చొప్పున తగ్గడం వల్ల ట్రూడౌన్‌ (ఛార్జీల తగ్గింపు) అమలు చేశామని, దీని ఫలితంగా నవంబరు బిల్లులో యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలు తగ్గించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగదారులకు ఛార్జీలు తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా వివరించారు. యూనిట్‌ కొనుగోలు వ్యయం 2026-27లో రూ.4.60కు తగ్గించాలనేది లక్ష్యంగా పేర్కొన్నారు. గుజరాత్‌లో నిర్వహించిన ఎనర్జీ సమ్మిట్‌లో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 76 గిగావాట్ల సౌర, పవన, హైబ్రిడ్, పీఎస్పీ, బ్యాటరీ స్టోరేజ్‌ ప్రాజెక్టులు అభి వృద్ధి చేస్తామని కేంద్రానికి ప్రతిపాదించామని సీఎస్​ వివరించారు. అన్నారు. 5 ఏళ్లలో సాధించా ల్సి న లక్ష్యాన్ని అధిగమించమన్నారు. ఇప్పటికే 90 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. వాటిని గ్రౌండింగ్‌ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 2029 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+