వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ మెట్రో రైల్ టెండర్ రద్దు: ప్రభుత్వం కీలక ఉత్తర్వులు: తాజా నిర్ణయం ఏంటంటే..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖకు పరిపాలనా రాజధాని తరలిస్తారనే ప్రచారం సమయంలో ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారింది. గతంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు దాఖలైన ఏకైక ఆర్ధిక బిడ్ రద్దు చేసిన ప్రభుత్వం ..ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం బిడ్ దాఖలు చేసిన ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్షియం ను ఇప్పుడు తప్పించారు. విశాఖ పరిధిలో మొత్తం 42.55 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లుగా విశాఖ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఫైనాన్షియల్ బిడ్ దాఖలు కావటంతో దీని పైన ముఖ్యమంత్రి జగన్ చేసిన ధర పైన కీలక ప్రతిపాదనలు చేసారు. వాటి ఆధారంగా ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ..తాజాగా మరో డీపీఆర్ తయారీ కోసం కొత్త కన్సెల్టెంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్, బెంగళూరును తలదన్నేలా.. విశాఖ: హరీష్ రావుకు ఏపీ బీజేపీ నేత కౌంటర్..!హైదరాబాద్, బెంగళూరును తలదన్నేలా.. విశాఖ: హరీష్ రావుకు ఏపీ బీజేపీ నేత కౌంటర్..!

విశాఖ మెట్రో ఫైనాన్స్ బడ్ రద్దు చేస్తూ..

విశాఖ మెట్రో ఫైనాన్స్ బడ్ రద్దు చేస్తూ..

రాష్ట్ర విభజన సమయంలో పునర్విభజన చట్టం మేరకు విశాఖ మెట్రో రైల్ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా గత ప్రభుత్వ హాయంలో విజయవాడలో మెట్రో రైల్ కోస్ ఏర్పాటు చేసిన అమరావతి మెట్రో రైల్ సంస్ధ విశాఖలోనూ మెట్రో ఏర్పాటు బాధ్యతలు తీసుకుంది. విశాఖలో మొత్తం 42.55 కిలో మీటర్ల మేరు సుమారు రూ. 8300 కోట్లతో మూడు కేరిడార్లుగా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం వివిధ సంస్థల నుండి రూ 4200 కోట్ల రుణానికి ప్రతిపాదనలు సిద్దం చేసుకున్నారు. అదే విధంగా.. 83 ఎకాల ప్రభుత్వ భూమితో పాటుగా మరో 12 ఎకరాల ప్రయివేట భూమిని సేకరించే బాధ్యత విశాఖ కలెక్టర్ కు అప్పగించారు. ఇతరత్రా మినహాయింపులు..రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. అయితే, ఇదే సమయంలో ముందుగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలైంది. ఇప్పుడు దీనిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పరిపాలన రాజధాని ప్రచార సమయంలో..

పరిపాలన రాజధాని ప్రచార సమయంలో..

విశాఖ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టాలని భావించారు. ఇందు కోసం అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. ఇందు కోసం ఒకే సంస్థగా నిలిచిన ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్షియం మాత్రమే బిడ్ దాఖలు చేసింది. దీంతో..విశాఖ మెట్రో రైల్ పైన తాజాగా ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందులో ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిన ధరను తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి అధికారుల ద్వారా సూచన చేసారు. ఆ విధంగా ఆ సంస్థ ముందుకు రాకపోవటంతో.. ఆ బిడ్ ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థానంలో కొత్త కన్సెల్టెంట్ ను నియమించుకొని కొత్త డిపీఆర్ సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫైనాన్స్ బిడ్డును రద్దు చేస్తూ..కొత్త డీపీఆర్ ను సిద్దం చేయాలని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందనే ప్రచారం సమయంలో ఇప్పుడు ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

మెట్రో గురించి సభలో జగన్ ఇలా..

మెట్రో గురించి సభలో జగన్ ఇలా..

ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో మూడు రాజధానుల గురించి ప్రస్తావించిన సమయంలో పరిపాలనా రాజధానిగా విశాఖ గురించి మాట్లాడారు. ఆ సమయంలో విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే పెద్దగా ఖర్చు ఉండదని చెబుతూనే..అక్కడ తక్కువ ఖర్చు తో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయవచ్చని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో విశాఖ లో మెట్రో రైల్ ఏర్పాటు చేస్తే చాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విశాఖలో మెట్రో రైల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని మీద ఇప్పుడు అనేక రకాలుగా చర్చ మొదలైంది.

English summary
AP Govt taken crucial decison on Vizag metro rail project. Govt cancelled the financial bid of Essel infra cansartitum for vizag metro. Govt decided to appoint new consultant for new DPR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X