సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌- కుదింపు..!!

ఏపీ ప్రభుత్వం సచివాలయాల సిబ్బంది సేవల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ తో పాటుగా అవసరం మేర వారి సేవలు వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తోంది. సచివాలయాలు ప్రాతినిధ్యం వహించే గ్రామ లేదా వార్డు జనాభా ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. అవసరమైతే కొన్ని సచివాలయాల సంఖ్యను కూడా తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

సిబ్బంది రేషనలైజేషన్
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు గ్రామ/వార్డు సచివాలయ శాఖపై సమీక్ష జరిపారు. సిబ్బంది హేతుబద్ధీకరణపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాల యాలు ఉన్నాయి. వాటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతీ సచివాలయంలో పది మంది సిబ్బంది ఉండేలా గతంలో డిజైన్ చేసారు. అయితే, ప్రస్తుతం సచివాలయాల్లో కొన్ని చోట్ల తక్కువగా, మరి కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఎక్కువ, తక్కువ ఉన్న సిబ్బందిని క్రమబద్ధీకరించడంతో పాటు, ఒక్కో సచివాలయానికి ఉండాల్సిన కనీస సిబ్బంది ఖరారు చేయనున్నారు.

AP govt decided to rationalize the Ward and Village Secretariat staff as population basis

ప్రభుత్వ కసరత్తు
ఈ సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది క్రమబద్దీకరణ, సచివా లయాల సంఖ్య కుదింపు తరువాత అదనంగా తేలిన సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేయాల ని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సిబ్బంది సంఖ్యను కుదించే అవకాశం కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని బహుళ ప్రయోజనాలు (మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్‌; సాంకేతిక సిబ్బందిగా టెక్నికల్‌ ఫంక్షనరీస్‌గా విభజించను న్నారు. 2,500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్‌, నలుగురు టెక్నికల్‌ సిబ్బంది కలిపి ఆరుగురిని గరిష్టంగా ఉంచాలని నిర్ణయించారు. అదే విధంగా జనాభా ఆధారంగా వీరి పోస్టుల సంఖ్యను ఖరారు చేయనున్నారు.

తాజా నిర్ణయంతో
రాష్ట్రంలో 2.500 లోపు జనాభాతో ప్రస్తుతం 3.562 సచివాలయాలు, 2,500 నుండి 3,500 వరకు జనాభాతో 5,388 సచివాలయాలు, అంతకుపైన జనాభాతో 6,053 సచివాలయాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు సిబ్బందిని సర్దుబాటు చేయటం కోసం అధికారుల ప్రతిపాదనకు సిఎం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈనెల 17న క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆస్పిరేషనల్‌ సెక్రటరీగా ఒకరిని నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీరి ద్వారా ఎఐ, డ్రోన్‌ టెక్నాలజిని గ్రామాల్లోకి తీసుకుపోవాలని చెప్పారు. సచివాలయాల సిబ్బందికి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలతో సాంకేతిక శిక్షణ అందించాలని, అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు బ్యాండ్‌ విడ్త్‌తో వైఫైని అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతీ ఇంటికి జయో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+