అమరావతిలో ఉద్యోగులకు ప్లాట్లు, రాయితీ - ధర ఫిక్స్, రుణ సదుపాయం...!!
ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలోని ఎంఐజీ లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10% మేర ప్లాట్లను రిజర్వు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 20 శాతం రాయితీతో ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రకాల విస్తీర్ణంలో ప్లాట్లు అందుబాటులోకి తెచ్చారు. గతం విలువ నిర్ధారంచారు. ఒకేసారి చెల్లిస్తే తగ్గింపు..అదే విధంగా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పది శాతం ప్లాట్లు కేటాయింపు
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేసి, 20 శాతం రాయితీతో ఇస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. 200,240 చదరపు గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, చదరపు గజానికి రూ 17,499గా ధర నిర్ణయించామని చెప్పారు. ఒప్పందం అయిన నెల లోపు మొత్తం సొమ్మును ఒకసారి చెల్లించిన వారికి 5 శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. 40 శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ఉందని చెప్పారు.

20 శాతం రాయితీ
ఎంఐజీ పోర్టల్, ఏపీసీఆర్డీఏ పోర్టల్ లో ఆగస్లు 1 నంచి వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు సయర్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలోనే జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలోని ఎంఐజీ లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10% మేర ప్లాట్లను రిజర్వు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్ల ధరలోనూ 20% మేర రిబేట్ ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ టౌన్‌షిప్‌లలో అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, ఏలూరు వద్ద లే అవుట్లు సిద్ధం చేశారు.

వాయిదాలు..రుణాలు
మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఅవుట్‌లో తొలి విడతలో 538 ప్లాట్లు వేశారు. ఎవరైనా ఈ లే అవుట్లలో ప్లాట్లు కొనాలనుకొనే వారు https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటరైజ్డ్ విధానంలో పూర్తి పారదర్శకతతో లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు మొత్తం ప్లాట్ ధరలో 10% ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ప్లాట్‌ను కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మూడు వాయిదాల్లో ఆన్‌లైన్‌లో చెల్లించాలి. కొనుగోలు ఒప్పందం కుదిరిన నెల రోజుల్లోపు 30%, ఆరు నెలల్లో మరో 30%, మిగిలిన 30 % నగదును ఏడాదిలోగా చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications