ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం- వారికి రూ 3వేల నగదు, ఇక ఉచితంగా..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాను వేళ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ముంపు ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. తుఫాను తీరం దాటిన తరువాత వారిని తిరిగి తమ నివాసాలకు పంపుతున్నారు. ఈ సమయంలో వారికి ప్రభుత్వం అండ గా నిలవాలని నిర్ణయించారు. ఉచితంగా నిత్యావసరాలు పంపిణీకి నిర్దేశించింది. ఆర్దిక సాయం పైన మార్గదర్శకాలు జారీ చేసింది.

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి నిత్యాసవరాలతో పాటుగా ఆర్దికంగా అండగా నిలవాలని నిర్ణయించింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు), కిలో కందిపప్పు , లీటర్ నూనె , కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర పంపిణీకి ఆదేశాలిచ్చారు.

ap-govt-decided-to-supply-free-essential-commodities-for-cyclone-affected-area-people

బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా చర్యలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

నిత్యావసరాలతో పాటుగా బాధితుడికి రూ.1000 చొప్పున ఆర్థికసాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉన్నా గరిష్ఠంగా రూ.3 వేలు అందివ్వాలని డిసైడ్ అయ్యారు. పునరావాస కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లేముందు ఆర్దిక సాయం అందించాలని స్పష్టం చేసారు. ప్రభుత్వ అధికారులు, హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్‌ ఫౌండేషన్, అన్నక్యాంటీన్‌ నెట్‌వర్క్‌ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ చేస్తున్నారు.

ఏలూరు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోనూ అన్నక్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. వీటితోపాటు నిత్యావసర వస్తువుల కిట్లను కూడా సిద్ధం చేసారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కూరగాయలు అందిస్తున్నారు. తుఫాను తీరం దాటటంతో ఇక.. శిబిరాల నుంచి వారిని ఇళ్లకు పంపుతున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+