సబ్సిడీపై టమోటా, ఏపీ ప్రభుత్వం నిర్ణయం - ఇలా అందుబాటులో..!!
సామాన్యులను ఠారెత్తిస్తున్న టమోటా ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టమోటా రేట్లు చుక్కులను తాకుతున్నాయి. దీంతో..ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు..పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో రూ 50కే అందుబాటులో ఉండేలా చర్యలు ప్రారంభించింది. ఈ రోజు (గురువారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
రూ 100 కి చేరిన టమోటా ధర:పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు టమోటా ధరలను హడలెత్తిస్తున్నాయి. వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినటంతో టమోటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది రోజుల వరకు కిలో రూ 20-30 మద్య టమోటా ధరలు ఉన్నాయి. ఇప్పుడు ఒకే సారి ఏకంగా రూ 100 వరకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో రూ 65 నుంచి రూ 90 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులకు భారంగా మారింది. ఇదే సమయంలో టమోటా తో పోటీ పడుతూ పచ్చి మిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సామన్యుల పైన భారం తగ్గించేందుకు టమోటాతో పాటుగా పచ్చిమిర్చిని సబ్సిడీ పైన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మార్కెటింగ్ శాఖ రైతు బజార్ల ద్వారా ఏర్పాట్లు చేస్తోంది.
సబ్సిడీ పై అమ్మకాలు:దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ కృత్రిమ కొరతకు కారకులైన వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టమోటా తో పాటగా పచ్చి మిర్చి ధరలు కూడా వంద దాటటంతో వాటిని కూడా సబ్సిడీ పై అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ లో ఉన్న ధరల పైన ఎప్పటికప్పుడు పర్యవేక్ష ణ కొనసాగిస్తూ.. రైతు బజార్ల ద్వారా సబ్సిడీకి అందించాలని నిర్ణయించారు. ధరలు పెరగటంతో పొరులు రాష్ట్రాల వ్యాపారులు రాష్ట్రంలోని పలు మార్కెట్ల నుంచి టమోటా ఎగరేసుకుపోతున్నారు. దీంతో అధికారులు కిలో రూ 70 చొప్పున 10 టన్నుల టమోటాలు సేకరించారు.
రైతు బజార్లలో కౌంటర్లు:ఈ రోజు నుంచి మిగిలిన మార్కెట్లలోనూ సేకరించనున్నారు. రోజుకు కనీసం 50-60 టన్నుల వరకు సేకరించి వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో రైతుబజార్లలో కిలో రూ 50 చొప్పున టమోటా విక్రయాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ సహా మిగిలిన జిల్లాల్లో ఈ రోజు ( గురువారం) నుంచి విస్తరించాలని నిర్ణయించారు.
సబ్సిడీ పైన టమోటా విక్రయాలు కొనసాగించేందుకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ధరలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటూనే..ధరలు తగ్గవరకూ రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధర పైన టమోటీ.. పచ్చి మిర్చి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రైతు బజార్లలో రూ 50కి సబ్సిడీ పైన టమోటా అందించేందుకు ఏర్పాట్లు చేసారు.












Click it and Unblock the Notifications