డేటా సెంటర్లపై బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక..! అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ కూ..!
భారత్ లో డేటా సెంటర్ల ఏర్పాటుతో రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పోటీ పడుతున్న వేళ వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అంతర్జాతీయంగా చర్చ కూడా అంతే స్దాయిలో జరుగుతోంది. డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి జరిగే నష్టంపై ఇప్పటికే ఎన్నో నివేదికలు వెలువడ్డాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (bill gates) తన మాజీ సంస్థతో పాటు అమెజాన్, మెటాలకు హెచ్చరికలు చేశారు.
బిల్ గేట్స్ సాధారణంగా నిరసనకారుల తరపున నిలబడరు. అయితే తాజాగా CNBCలో మాట్లాడుతూ ఏఐ పరిశ్రమకు సామాన్య ప్రజల విద్యుత్ బిల్లులు పెంచే హక్కు లేదని తేల్చిచెప్పేశారు. దానికి సాధారణ నిరసనకారుల మాటల కంటే ఎక్కువ విలువ ఉందని భావిస్తున్నారు. AI క్రేజ్, ఆర్థిక విలువ, చైనాతో పోటీ అన్నీ నిజమే కానీ, ఒక కంపెనీ స్థానికంగా వచ్చి తొమ్మిది గిగావాట్ల విద్యుత్ కోరినప్పుడు, అక్కడ ఉండే రాజకీయ ఒప్పందం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. స్థలం, ఆర్థిక అంశాలు లేదా స్థానిక ప్రజల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగదన్నారు.

ఈ పాఠాన్ని పరిశ్రమ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించి నేర్చుకుందన్నారు. 2025లో 156 బిలియన్ డాలర్ల విలువైన నలభై ఎనిమిది ప్రాజెక్టులు నిలిచిపోయాయి లేదా ఆగిపోయాయని గుర్తుచేశారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో మరో ఇరవై ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు. కెవిన్ ఓలీరీకి చెందిన ఉటా మెగా కాంప్లెక్స్ విస్తీర్ణాన్ని 40వేల ఎకరాల నుండి 20 వేల ఎకరాలకు తగ్గించాలని రాష్ట్ర సెనేట్ అధ్యక్షుడు డిమాండ్ చేయడంతో, గత వారం ఆ ప్రాజెక్టు పరిధిని సగానికి తగ్గించాల్సి వచ్చింది.
అణుశక్తితో ఆయన సొంత సంస్థ 'టెరాపవర్' నిర్మిస్తున్న చిన్న రియాక్టర్లను స్థానిక ప్రజలకు విద్యుత్ ఖర్చులు పెరగని చోట నిర్మిస్తామన్నారు. యుద్ధానంతర అమెరికా గ్రిడ్, కొత్త ఉత్పత్తి ఖర్చులను యూటిలిటీ కంపెనీలు భరించి, దశాబ్దాల పాటు వినియోగదారులపై మోపే విధానంతో పెరిగిందని, ఆ పాత ఏర్పాటు ఇప్పుడు ముగిసిందని తెలిపారు. మార్చిలో, అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, ఒరాకిల్ మరియు ఎక్స్ ఏఐ సంస్థలు వైట్ హౌస్‌లో సమావేశమై, తమ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ఖర్చులను తామే భరిస్తామని 'రేట్‌పేయర్ ప్రొటెక్షన్ ప్లెడ్జ్'పై సంతకం చేశాయన్నారు. గేట్స్ ఇప్పుడు ఆ సంస్థలకు ఒకే మాట గుర్తు చేస్తున్నారు... సంతకం చేయడం సులభం, అమలు చేయడం కష్టం. "ప్రజల విద్యుత్ ఖర్చులను పెంచే అనుమతి మాకు లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

మార్చిలో జరిగిన గ్యాలప్ పోల్ ప్రకారం, 70 శాతం మంది అమెరికన్లు తమ ఇంటి సమీపంలో డేటా సెంటర్లను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అణువిద్యుత్ విషయంలో కూడా ఇంత వ్యతిరేకత లేదన్నారు. 15 పెద్ద దేశాల్లో 'పబ్లిక్ ఫస్ట్' నిర్వహించిన సర్వేలో, అమెరికాలో కేవలం 26 శాతం మంది మాత్రమే దీనికి మద్దతు తెలుపుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యల్పం. ఫెస్టస్, మిస్సౌరీలో 6 బిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన మరుసటి వారమే, నలుగురు సిటీ కౌన్సిల్ సభ్యులను ప్రజలు ఓడించారని తెలిపారు.












Click it and Unblock the Notifications