పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం- మార్గదర్శకాలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. మార్చి నెలాఖరు ఆర్దిక సంవత్సర ముగింపు.. వరుస సెలవులు కావటంతో ప్రభుత్వం ఈ నెల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో.. బ్యాంకుల సెలవుల కారణంగా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
పెన్షన్ల పంపిణీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను ప్రభుత్వం రూ 4 వేలకు పెంచి అమలు చేస్తోంది. అన్ని కేటగిరీల పెన్షన్లు పెంచింది. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఇంటి వద్ద కు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. అనర్హు లకు పెన్షన్ల పైన అధ్యయనం జరుగుతోంది. అర్హులకు కోత ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే ప్రతీ ఇంటికి ఒకటో తేదీనే అందేలా అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు సహా, మంత్రు లు..ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 1న జారీ చేసే పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

తాజా మార్గదర్శకాలు
కూటమి ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ పైన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాల ను నిర్దేశించింది. అందులో భాగంగా వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులకు నెలకు 4000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ, తలసీమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి నెలకు రూ, 15,000లకు పెంచి పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.2,700 కోట్లను ఖర్చు చేస్తోంది.
ప్రకాశం కు చంద్రబాబు
ఇక, మార్చి నెలాఖరు.. ఆర్దిక సంవత్సరం ముగింపు.. వరుస సెలవుల కారణంగా ఈ రోజునే (శనివారం) పెన్షన్ నగదు బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శనివారమే నగదు డ్రా చేసుకోవాలని సచివాలయాలను ఆదేశించింది. ఈ సారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా పెదగంజాంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్ లబ్ది దారులకు ఇబ్బందులు లేకుండా ఏప్రిల్ 1వ తేదీన ప్రతీ నెలా తరహాలోనే పెన్షన్ల పంపిణీకి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులు.. సచివాలయాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications