ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 26 డిమాండ్లపై హామీ

అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. సత్వరమే తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలంటూ వారు చాలాకలంలో ఉద్యమిస్తూనే వస్తోన్నారు. సామరస్యపూరకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ కొలిక్కి రావట్లేదు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరుకుంటోన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అమరావతి ప్రతినిధులు ప్రభుత్వం ముందు 26 డిమాండ్లను ఉంచారు. అన్ని శాఖలు, విభాగాల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు, సెలవులు, ఇతర ఆర్థికపరమైన డిమాండ్లు అవి. వాటిని పరిష్కరించాలంటూ సుదీర్ఘకాలంగా ఆందోళనలు సాగిస్తోన్నారు. ఆర్థిక వెసలుబాటు లేకపోవడం వల్ల ప్రభుత్వం వాటిని సత్వరమే పరిష్కరించడానికి వెనుకాడుతోందనే వాదనలు ఉన్నాయి.

AP govt employees meets Chief Secretary KS Jawahar Reddy

పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వ ఇదివరకు కూడా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. పలు దఫాలుగా వారితో చర్చలు జరిపింది. పీఆర్సీ అమలుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామంటూ కమిటీ స్పష్టం చేసింది. వాటిల్లో కొన్నింటిని పరిష్కరించింది.

జీపీఎఫ్ ఇతర పెండింగ్ బిల్లులతో పాటు ఇతర డిమాండ్లను కూడా నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని గతంలో మున్సిపల్ శాఖ మంత్రి, కమిటీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. ఇప్పటికే జాప్యమైందని, తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలనేది వారి వాదన. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరోసారి ఉద్యోగుల జేఏసీ నాయకులు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని కలిశారు.
26 డిమాండ్లపై చర్చించారు. వాటన్నింటినీ మంత్రుల కమిటీకి పంపిస్తానని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+