Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎల్ఆర్ఎస్ పధకం సమయం పొడిగింపు - వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు కొనసాగింపు..!!

పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడువును 2022 మార్చి 31 తేదీ వరకూ ప్రభుత్వం పొడిగించింది. 2020 ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా 2021 సెప్టెంబరు 31 తేదీలోగా అందుకున్న క్రమబద్దీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు గడువు పెంచుతూ పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ సిబ్బంది అగ్రిగోల్డ్ భూముల్లో జగనన్న స్మార్ట్ టౌన్లు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాల్లో నిమగ్నమైనందున అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతున్నట్టు పురపాలక శాఖ పేర్కొంది.

ఎల్ఆర్ఎస్ 2020 పథకంలో భాగంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు గడువు ముగిసే నాటికి 43,753 దరఖాస్తులు వచ్చినట్టు తెలియచేసింది. ఇప్పటి వరకూ అందులో 14,218 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించగలిగినట్టు వెల్లడించింది. ఈ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు నిర్దేశిత ప్రామాణిక విధానాన్ని పాటించాలని సూచిస్తూ అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. గత కొద్ది నెలలుగా అధికారులు జగనన్న కాలనీల గుర్తింపులో బిజీగా ఉన్నారు.

AP govt Extend the time for LRS scheme implemntation up to next year mearch ending

రాష్ట్రంలో నగర కమిషనర్లు.. అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల వైస్ ఛైర్మన్లు..మున్సిపల్ కమిషనర్లు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంతో పాటుగా అనధికార లేఅవుట్లను గుర్తించే కార్యక్రమాన్ని సమాంతరంగా చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దరఖాస్తు దారులకు నోటీసులు పంపటంతో పాటుగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించాలి.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu

    అర్బన్ లోకల్ బాడీస్..ఉడాలు..మెట్రో పాలిటిన్ నగర సంస్థలు..మున్సిపల్ కమీషనర్లు ప్రతీ వారం సమీక్ష నిర్వహించాలి. పెండింగ్ లో ఉన్న 29 వేల 535 దరఖాస్తుల ఎల్ఆర్ఎస్ పరిష్కారానికి డిసెంబర్ 15 లోగా లేఖలు పంపాలని ఆదేశిచింది. రాష్ట్ర స్థాయిలో సీడీఎంఏ, టీఐసీపీ 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించి గడువు లోగా లేఅవుట్ల క్రమబద్దీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+