25 మంది సభ్యుల టీటీడీ బోర్డు ఫైనల్ - ముగ్గురు ఎమ్మెల్యేలకు ఛాన్స్ : ఫైనల్ లిస్టులో ఉన్నది వీరే..!!
ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మక టీటీడీ బోర్డు ఫైనల్ చేసారు. మొత్తం 75 మంది సభ్యులతో టీటీడీ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. అందులో కీలకంగా 25 మందితో ప్రధాన ట్రస్టు ఏర్పాటు చేసారు. ఈ 25 మంది జాబితాను ప్రభుత్వం వెల్లడించింది. మిగిలిన 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగనున్నారు. అనూహ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టీటీడీ తాజా బోర్డులో అవకాశం కల్పించారు. ఈ జాబితాలో ఏపీతో పాటుగా తెలంగాణ..తమిళనాడు..కర్ణాటక..మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం కల్పించారు.

టీటీడీ బోర్డులో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు గా ఉన్న మూడు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎంపిక చేసారు. ఉత్తరాంధ్ర నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు..కోస్తాంధ్ర నుంచి కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్..రాయలసీమ నుంచి సీనియర్ గా ఉన్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కి అవకాశం కల్పించారు. అదే విధంగా గత బోర్డులో పని చేసిన వారిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వర రావు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కు తిరిగి కొనసాగించాలని సీఎం నిర్ణయించారు.

తెలంగాణ -కర్ణాటక నుంచి వీరే సభ్యులుగా
ఇక, తెలంగాణ నుంచి కల్వకుర్తి విద్యాసాగర్, మారంశెట్టి శ్రీరాములుత తో పాటుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హెటిలో పార్ధసారధి రెడ్డి పేరు ఎంపిక చేసారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి క్రిష్ణారావు ను సైతం టీటీడీ బోర్డు సభ్యుడిగా సీఎం జగన్ ఖరారు చేసారు. మహారాష్ట్ర నుంచి సీఎం థాక్రే సిఫార్సు మేరకు శివసేన కార్యదర్శిగా ఉన్న మిలింద్ కు టీటీడీ బోర్డులో పేరు ఖరారైంది. కర్ణాటక నుంచి పోకల అశోక్ కుమార్ తో పాటుగా శంకర్, శశిధర్, డాక్టర్ కేతన్ దేశాయ్ పేర్లు ఖరారు చేసారు.

స్టాలిన్ సిఫార్సు మేరకు వీరికే అవకాశం
తమిళనాడు నుంచి సీఎం స్టాలిన్ చేసిన సిఫార్సు మేరకు ఎమ్మెల్యే నంద కుమార్, కన్నయ్య, జీవన్ రెడ్డి, సౌరభ్, రాజేశ్ శర్మ పేర్లు ఖరారు అయినాయి. వీరితో పాటుగా శంకర్ ... విశ్వనాధ్ రెడ్డి సైం టీటీడీ సభ్యులుగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, మిగిలిన 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం నిరయమించనుంది. వారు సభ్యులుగా ఉన్నా.. విధాన పరమైన నిర్ణయాల్లో వారికి ప్రమేయం ఉండదు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి..తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి సైతం బోర్డులో సభ్యులుగా ఉండనున్నారు.

50 మందితో ఎక్స్ అఫీషియో లిస్టు
మిగిలిన 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యల జాబితా పైన తుది కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితా సైతం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత బోర్డు కూర్పులో పలు రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున సిఫార్సులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతీ సభ్యుడి బయోడేటా తో పాటుగా వారి ట్రాక్ రికార్డు ఆధారంగా సభ్యులను ఎంపికి చేసినట్లు తెలుస్తోంది.
-
దర్శనం, టోకెన్ల జారీ, క్యూ లైన్లలో టీటీడీ కీలక మార్పులు- ఈ తేదీ నుంచి అమలు..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications