ఏపీలో జులై 10న మెగా పండుగ.. రెడీ అవ్వమన్న మంత్రి లోకేష్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యాశాఖను బలోపేతం చేయడం పైన, విద్యార్థుల చదువులపైన ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో విద్య వ్యవస్థను మెరుగుపరచడం కోసం నడుంబిగించిన ఏపీ ప్రభుత్వం ఈనెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒక మెగా పండుగను నిర్వహించడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.
మెగా పీటీఎం 2.0.. ముహూర్తం ఫిక్స్
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమన్వయంతో పాఠశాలలను మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం అందరి సమిష్టి కృషితో నాణ్యమైన విద్య, పాఠశాల విద్యార్థులకు అందుతున్న పథకాల అమలు లో పారదర్శకత ,అభివృద్ధి పనుల వేగవంతానికి దోహదం చేసేలా మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో చర్చించే అంశాలివే
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
ఈ సమావేశంలో విద్యార్థులకు అందుతున్న విద్య, తరగతుల నిర్వహణ, వారికి అందిస్తున్న మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు అందుతున్నటువంటి కిట్లు వంటి అనేక అంశాల పైన చర్చిస్తారు. పిల్లల హాజరు నమోదు, విద్యా సామర్థ్యాల పైన కూడా చర్చిస్తారు.
విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై ఫోకస్
పిల్లల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వాములను చేసేలా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ తో సమన్వయం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు లాభం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఇవి అనివార్యం అని భావిస్తోంది. ఇక ఇదే విషయాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు.
గిరిజన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థులకు పర్యావరణం పైన అవగాహన కల్పించాలని, పాఠశాలలలో ఎకో క్లబ్ లు ఏర్పాటు చేయాలని, మొక్కలను పరిరక్షించే విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ లు ఇవ్వాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల స్కూల్స్ కు కూడా మొబైల్ నెట్ వర్క్ అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పాననన్నారు.గిరిజన విద్యార్థులు బడులకు వెళ్ళే దారులపై అధ్యయనం చెయ్యాలని చెప్పానన్నారు.
ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు
అవసరం అనుకున్న చోట్ల కొత్త భవనాలు నిర్మాణం చెయ్యాలని సూచించానని పేర్కొన్నారు. అంతేకాదు ఆగస్టు నాటికి డిఎస్సి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని, నైపుణ్య అభివృద్ధి శాఖ ద్వారా సెప్టెంబరులో నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications