సునీల్ కుమార్ పై ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు, రిటైర్మెంట్ వరకూ..!!

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పీవీ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ రూల్స్‌, 1969లోని రూల్‌ 3 (3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగు తున్న నేపథ్యంలో, ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ అయిన 2026, జూన్ 30 వరకు ఏది ముందుగా వస్తే ఆ తేదీ వరకూ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా పని చేసారు. కాగా, గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం. 187/2024 కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన క్రిమినల్ సెక్షన్లు ఉన్నాయి. దర్యాప్తు జరుగుతున్న ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నందున, పీవీ సునిల్ కుమార్‌ను సర్వీసులోకి తీసుకుంటే సాక్ష్యాధారాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ap-govt-has-extended-the-suspension-of-senior-ips-officer-pv-sunil-kumar-here-the-details

ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో.. ఇక రిటైర్మెంట్ వరకూ

అయితే, సునీల్ కుమార్ గతంలో సీఐడీ అడిషనల్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై వచ్చిన ఫిర్యాదులు, ముఖ్యంగా కస్టోడియల్ హింసకు సంబంధించిన ఆరోపణలు ఆయన కెరీర్‌లో పెద్ద మలుపుగా మారాయి. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలో విచారణలో ఉంది. అదే విధంగా సునీల్‌ కుమార్‌ అనుమతి లేకుండా 2020 నుంచి 2024 మధ్య విదేశాలకు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ ప్రభుత్వం గతంలో చర్యలు చేపట్టింది. అగ్రి గోల్డ్‌ నిధులు దుర్విని యోగం ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. వరుస సస్పెన్షన్లతో ఇరకాటంలో పడ్డ సునీల్ కుమార్, తన పదవీ విరమణ వరకు ఇక విధుల్లో చేరే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అయితే, రిటైర్మెంట్ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+