ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది జీతం అకౌంట్‌లో వేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత వివిధ శాఖల్లో గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని సరిచేస్తున్నారు. కొన్ని కొన్ని విభాగాల ఉద్యోగులకు ఏడాదిపాటు వేతనాలు లేవని తెలియడంతో వాటిని వెంటనే విడుదల చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్న ద్రవిడ విశ్వవిద్యాలయం సిబ్బందికి జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి వేతనాలను నిలిపివేసింది. ఈ విషయం తెలియడంతో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పెండింగ్ వేతనాలు రూ.2.86 కోట్లు విడుదల చేశారు.
రాక్షసానందం పొందింది
విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులకు వేతనాలు చెల్లించకుండా గత ప్రభుత్వం రాక్షసానందం పొందిందంటూ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తన దృష్టికి వచ్చిన వెంటనే వేతనాలను విడుదల చేయడం జరిగిందన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి రాష్ట్రంలోని విద్యార్థులందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృష్టిచేస్తోందని మంత్రి అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కాపలదార్లు, ఆయాలకు కూడా
ద్రవిడ విశ్వవిద్యాలయ సిబ్బందితోపాటు ఇటీవలే విద్యాశాఖలోని కాపలదార్లు, ఆయాలకు పెండింగ్ లో ఉన్న వేతనాలను కూడా ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వారికి దాదాపు రూ.65 కోట్ల బకాయి ఉండటంతో వాటిని చెల్లించేశారు. పాఠశాలలను శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేస్తారు.
వాటి బకాయిలు కూడా దాదాపు రూ.90 కోట్లు ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వం వాటిని కూడా విడుదల చేసింది. ఇకనుంచి ప్రతి పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారనే విషయాన్ని బోర్డుపై నమోదు చేయనున్నారు. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. బ్లాక్ బోర్డుపై కుడివైపున వీటిని నమోదు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications