అసెంబ్లీ వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ జాయింట్‌ సెక్రటరీ విజయరాజుపై వేటు పడింది. ఆయనను సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన వ్యవహరించిన తీరు పైన ఫిర్యాదులు ఉన్నాయి. రేపు (11వ తేదీ) ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ముందుగానే అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ పైన వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభ వేళ ప్రభుత్వం ముఖ్య అధికారి పై వేటు వేసింది. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును సస్పెండ్ చేసింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ చర్యలు తీసుకున్నారు.

AP Govt has suspended joint secretary M Vijaya Raju of the legislature secretariat

విజయరాజును సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన పేరిట డీజీపీ కార్యాలయానికి విజయరాజు లేఖ రాశారు. అప్పటి అసెంబ్లీ చీఫ్ మార్షల్ దియో ఫిలస్‌పై అసెంబ్లీలో ఎటువంటి రిమార్క్ లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. థియో ఫిలస్‌పై అప్పటికే మండలి చైర్మన్ ఛాంబర్‌పై కెమెరా తిప్పిన వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు.

ఆరోపణలు ఉన్నా.. ఎలాంటి రిమార్క్ లేదంటూ క్లీన్ చిట్ ఇస్తూ విజయరాజు లేఖ రాయటంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారం పైన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సీరియస్ అయ్యారు. దీని పైన ప్రభుత్వానికి నివేదిక అందింది. అందులో డీజీపీ కార్యాలయానికి విజయరాజు లేఖ రాసిన విషయం నిజమేనంటూ ప్రభుత్వానికి నివేదికలో స్పష్టం చేసింది.దాంతో చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ప్రభుత్వం సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. ప్రభుత్వ నివేదికను పరిశీలించిన గవర్నర్ సైతం చర్యలకు అనుమతించారు. దీంతో విజయరాజును సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+