రిజిస్ట్రేషన్ జరిగిన 20 నిమిషాల్లోనే డాక్యుమెంట్ - కీలక మార్పులు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తులపై ఆధారపడకుండా సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేలా రాజా నిర్ణయాన్ని అమలు చేయనుంది. రిజిస్ట్రేషన్ జరిగిన 20 నిమిషాల్లోనే దస్తావేజులు తిరిగి పొందేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి తీసుకురానుంది.
నూతన విధానం అమలు
ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ ద్వారా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూనే అదనంగా ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో రూపొందించిన ఒక చిన్న దరఖాస్తు నింపటం ద్వారా కొనుగోలుదారులు తమ దస్తావేజుల రిజిస్ట్రేషన్ సులువుగా పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది.

రిజిస్ట్రేషన్ జరిగిన 20 నిమిషాల్లోనే దస్తావేజులను తిరిగి పొందవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ విధానాన్ని సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. ఏ ఏ సబ్జెక్టు సార్ కార్యాలయాల్లో ఎప్పటినుంచి ఈ విధానాన్ని అమలు చేయాలో తెలియజేస్తూ ప్రభుత్వం జిల్లాలకు మార్గదర్శకాలు దారి చేసింది.
సులువుగా రిజిస్ట్రేషన్
ఈ నూతన విధానం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడకుండా సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేలా ఈ సాఫ్ట్ వేర్ రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ లింకుతో రిజిస్ట్రేషన్ సేవలు అనుసంధానం చేయటం వల్ల అసలు వ్యక్తులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు ఉండదని, అవక తవ్వకలను నిరోధించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఇతర విధానంలో భాగంగా ముందుగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. సెల్ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటిపిని నమోదు చేసి ఎంటర్ కావాలి. ఆస్తుల తాలూకు పూర్వ దస్తావేజులను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ విధానంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలను తామే సొంతంగా తెలుసుకొని ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
20 నిమిషాల్లో డాక్యుమెంట్లు
క్రయ విక్రయదారుల ఫోటోలను కార్యాలయాల్లోనే తీస్తారు. ఈ కేవైసీ కూడా అక్కడే జరుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్న సంతకాలు ఇక్కడ ముదిరితమవుతాయి. ఈ విధానాల్లో వినియోగదారులు ఎలాంటి దస్తావేజులను సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వాటి ఆధారంగానే వివరాలను పరిశీలిస్తారు.

ఆన్లైన్లోనే చేసుకున్న స్లాట్ బుకింగ్ అనుగుణంగా తేదీ, ఆ సమయానికి క్రయ విక్రయ దారులు సాక్షులు వెళ్లాలి. సబ్ రిజిస్టార్ ఈ సైజు ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిస్తారు. ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలు, జతపరిచిన పత్రాల ఆధారంగా భూముల వివరాలను పరిశీలిస్తారు. స్కానింగ్ ప్రక్రియ లేనందున రిజిస్టర్ దస్తావేజులను 20 నిమిషాల్లో తీసుకొని వెసులుబాటు కలుగుతుంది.












Click it and Unblock the Notifications