పెన్షన్ల పంపిణీ వేళ, చివరి నిమిషంలో - ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (సోమవారం) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొద్ది రోజులుగా అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారిని గుర్తించి నోటీసులు ఇచ్చిన విషయం రాజకీయంగా వివాదాస్పదం అయింది. వీరికి పెన్షన్ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా.. ఈ రోజు పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం అధికారులకు స్పష్టత ఇచ్చింది. నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ పెన్షన్లు ప్రతీ నెలా తరహా లోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబరు ఒకటో తేదీన 63,61,380 మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.2746.52 కోట్ల నిధులు గ్రామ, వార్డ్ సచివాలయాలకు విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. అలాగే, పేదల సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్నారు. మండలంలోని బోయనపల్లెలో స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం దోబీఘాట్‌లో రజకులతో మాటాడి వారికి పలు పథకాలు అందజేయనున్నారు. తర్వాత తాళ్లపల్లెలో ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు.

ఇక, కొద్ది రోజులుగా అనర్హులకు పెన్షన్ల విషయంలో కొంత చర్చ జరుగుతోంది. వారికి జారీ చేసిన నోటీసులతో సంబంధం లేకుండా ఈ నెలలో అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటీసులు అందుకున్న 1.35 లక్షల మందిలో 95 శాతం మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. దీనివల్ల దివ్యాంగులకు తాత్కాలికంగా ఉపశమనం లభించనుంది. కాగా, రెగ్యులర్ పింఛన్లతోపాటు, కొత్తగా మంజూరైన 7872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారులకు కోసం రూ.3.15 కోట్లు అదనంగా విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ కోసం రూ.32,143 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే, పింఛన్లకు అనర్హులుగా గుర్తించిన కొద్దిమందిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. నోటీసులందుకున్న వారిలో అప్పీల్ చేసుకోని వారి గురించి రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications