వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది బదిలీలు - ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ..!!
ఏపీలో ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు పైన ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేషనలైజేషన కు వీలుగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జిఓ ఎంఎస్ నెంబరు 1001ని శుక్రవారం విడుదల చేసింది.
ఉద్యోగుల సర్దుబాటు:రాష్ట్రంలో మొతకతం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగలున్నారు. ప్రస్తుతం 7900 సచివాలయాల్లో 8 మంది కంటే ఎక్కువగానే ఉద్యోగులు కొనసాగుతున్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో, ప్రతీ సచివాలయంలో కనీసం 8 మంది ఉండేలా ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు జిఓ ఎంఎస్ నెంబరు 1001ని విడుదల చేసింది. 8 మంది పని చేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు స్పష్టం చేసారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా దాదాపుగా 5 వేల మందికి స్థాన చలనం ఉండే అవకాశం కనిపిస్తోంది. పాత జిల్లాల యూనిట్ ప్రకారమే రేషనలైజేషన్ ప్రకియ ఉంటుందని అందులో స్పష్టం చేసింది.

మార్గదర్శకాలు జారీ:స్పౌస్ కేటగిరిలో భార్య, భర్తలకు జిల్లా/అంతర్ జిల్లాల బదిలీలు చేయొచ్చని కూడా జిఓలో పేర్కొంది. జిల్లాల్లో అవసరమైన పోస్టులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపింది. ఎనిమిది మంది కంటే ఎక్కువ సచివాలయ ఉద్యోగులు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎనిమిది మంది కంటే తక్కువ ఉన్న సచివాలయాలకు సిబ్బందిని బదిలీలు చేయనున్నారు. బదిలీల ప్రక్రియలో హోదాల ప్రాధాన్యతా క్రమంలో నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులతో నేరుగా కౌన్సిల్గ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కౌన్సిలింగ్ ద్వారా కేటాయింపు:గ్రామీణ ప్రాంతాల్లోనైతే మొదటి ప్రాధాన్యతగా సంక్షేమం, విద్య అసిస్టెంట్/వార్డు సంక్షేమం అభివృద్ధి కార్యదర్శి (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డిఎస్), రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్ (జిఎంఎస్‌కె)), మూడో ప్రాధాన్యతగా డిజిటల్ అసిస్టెంట్లు, నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్, పట్టణాల్లో ప్రాధాన్యత వార్డు సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శి, రెండో ప్రాధాన్యతగా వార్డు మహిళలు, బలహీనుల విభాగం రక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్), మూడో ప్రాధాన్యతగా వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులుగా ప్రాధాన్యతల వారీ బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో మార్గనిర్దేశం చేసింది.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ











Click it and Unblock the Notifications