అంగన్వాడీల సమ్మె పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఎస్మా చట్టం ప్రయోగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సమ్మెలో ఉన్న అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలు చర్చలు చేసినా ఫలితం రాలేదు. దీంతో, ప్రభుత్వం తాజాగా ఎస్మా ప్రయోగానికి నిర్ణయించింది.
జీతాల పెంపు, గ్రాట్యుటీ పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 26 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారు. వారితో దఫదఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం వారి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఆర్థికంగా ప్రభావం పడని వాటికి ఓకే చెప్పింది కానీ జీతాల పెంపుపై వారికిహామీ ఇవ్వలేదు. అందుకే అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె విరమించడం లేదు. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తారని సర్కార్ పేర్కొంది.

1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సమ్మెలో ఉన్నవారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుంది. గత కొన్ని రోజులుగా అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరపింది. పలు డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని డిమాండ్ పరిష్కారం వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె కొనసాగించం వలన ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం అంగన్వాడీలకు వివరించింది. అయినా వారు సమ్మె విరమించకపోవటంతో..ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications