తిరుపతి తొక్కిసలాట పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..!!

తిరుపతి తొక్కిసలాట ఘటన పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, పలువురు అధికారుల పైన ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా, ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైకుంఠ ఏకాదశి వేళ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల లో టికెట్ల జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. పద్మావతి పార్క్ లో ఏర్పాటు చేసిన టికెట్ కేంద్రం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు గాయాల బారిన పడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు టీటీడీ రూ 25 లక్షల చొప్పున పరిహారం అందించింది. క్షతగాత్రులకు చికిత్సతో పాటుగా పరిహారం అందించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు.

AP Govt issues orders over Appointment of Judicial Inquiry into the Stampede at Tirupati

ఘటన పైన సమీక్ష అనంతరం తిరుపతి ఎస్పీ, డీఎస్పీ, టీటీడీ తిరుపతి జేఈవో పైన చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఘటన పైన న్యాయ విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మాజీ జడ్జి సత్యనారాయణ ను ప్రత్యేక విచారణ కమీషన్ గా నియమించింది. ఆరు నెలల్లోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ సమయంలో అధికారికి పూర్తిగా సహకరించాలని సంబంధిత అధికార యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+