అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు జమ ఆ రోజే - ప్రభుత్వం తాజా ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల జమ పైన కీలక అప్డేట్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతులకు ప్రతీ ఏటా రూ 20 వేలు ఇవ్వనుంది. తొలి విడతగా ఆగస్టులో రూ 5 వేలు చొప్పున జమ చేసింది. పీఎం కిసాన్ పథకం నిధులతో పాటుగా వీటిని విడుదల చేస్తోంది. ఈ నెల 19వ తేదీన కేంద్రం పీఎం కిసాన్ నిధుల విడుదల కు నిర్ణయించింది. దీంతో.. ఏపీ సైతం అదే రోజున పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 19న అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ'-పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష చేసారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్,అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు దిశానిర్దేశం చేసారు. ఈ నెల 19న 'అన్నదాత సుఖీభవ' పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని వెల్లడించారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులు కేంద్రం విడుదల చేయనుంది. ఈ నెల 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి రైతుల ఖాతాల్లో నిధులను విడుదల చేయనున్నారు.

కాగా, ప్రభుత్వం ఇదే సమయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. NPCAలో ఇన్ యాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేసారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని మంత్రి నిర్దేశించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత 46,62,904, లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు లెక్కలు తేల్చారు. రెండో విడతలో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు మొత్తం రూ .7 అన్న దాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లోకి ఈ నెల 19న జమ కానున్నాయి. అన్నదాత సుఖీ భవ-పీఎం కిసాన్ పథకం కింద రూ.3077.77 కోట్లు రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి.












Click it and Unblock the Notifications