'అయ్యగారే నెంబర్ వన్ ఫ్యాన్' కు అఖిల్ ఊహించని గిఫ్ట్.. ఇలా ఏ హీరో చేయడేమో..!

సాధారణంగా ఏ హీరోకు అయిన ఫ్యాన్స్ ఉంటారు.. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. చాలా తక్కువ మందికి మాత్రమే కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అక్కినేని అఖిల్ కు ఇప్పటి వరకూ సరైన హిట్ లేదు. కానీ ఆయన్ను దేవుడిలా ఆరాధించే ఓ కల్ట్ ఫ్యాన్ ఉన్నాడు. అయ్యగారే నెంబర్ వన్, ఎవరివల్లా కాదు.. అఖిలే కరెక్ట్.. అంటూ అఖిల్ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా రచ్చ రచ్చ చేసేవాడు ఓ యువకుడు. ఆయన ఇచ్చిన పేరుతోనే చాలామంది అఖిల్ ను అయ్యగారు అని పిలుస్తుంటారు. ఆ కల్ట్ ఫ్యాన్ ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాడు. కారణం ఏంటంటే ఇటీవల అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ రిలీజ్ సందర్భంగా ఆ ఫ్యాన్ థియేటర్ కు వచ్చి సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు.

అయితే అక్కినేని అఖిల్ కు కూడా ఈ అభిమాని సుపరిచితమే.. ఓసారి అఖిల్.. అభిమాని వీడియో చూసి కచ్చితంగా కలుస్తానని కూడా చెప్పారు. భారీ హిట్టు కొట్టిన తర్వాతే కలుస్తానని అఖిల్ అప్పట్లో తెలిపారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు తెలుస్తోంది. లెనిన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ తన వీరాభిమానిని కలిసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఓ అభిమానిని కలిసేందుకు హీరో స్వయంగా రావడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

AkhilAkkineni to meet Number One Fan an unexpected gift fan following the blockbuster success

ఇక లెనిన్ సినిమా థియేటర్ల వద్ద ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత అఖిల్ భారీ కమర్షియల్ హిట్ కొట్టిన నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అటు బుక్ మై షో యాప్ లో టికెట్స్ హాట్ కేకుల్లా బుకింగ్ అవుతున్నాయి. వీకెండ్ నేపథ్యంలో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. ఇప్పటికే లెనిన్ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టారు అఖిల్. మున్ముందు లెనిన్ సినిమాతో అఖిల్ తన కెరీర్ లోనే బెస్ట్ రికార్డులను పెట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+