'అన్నదాత సుఖీభవ’ నిధులు రాలేదా, మరో ఛాన్స్ - ఇలా చేయండి..ఇదే లాస్ట్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు అందని రైతుల కోసం మరో ప్రకటన చేసింది. ఈ నెల 2న పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. పలువురు రైతులు తమకు నిధులు అందలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అటువంటికి మరో అవకాశం కల్పించారు. అర్హత ఉండీ నిధుల అందని రైతులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది.
ఏపీ వ్యవసాయ శాఖ రైతుల కోసం కీలక ప్రకటన చేసింది. అన్నదాత సుఖీభవ' పథకానికి అర్హత ఉండీ, లబ్ధి పొందని రైతులు ఈనెల 20వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు కోరారు. అర్హతను నిర్ధారించడంలో ఉన్నత స్థాయి పరిశీలన, ధ్రువీకరణలో తిరస్కరణకు గురైన రైతులు, పథకానికి అర్హులైనా ఈ-కేవైసీ చేసుకోక తిరస్కరణకు లోనైన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి, 'అన్నదాత సుఖీభవ' పోర్టల్‌లో తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు. జూలై 27వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, వారిలో అర్హులను గుర్తించి, నిధులు జమ చేసినట్లు తెలిపారు.

అర్హత ఉన్న రైతులకు ప్రయోజనం దక్కేలా రెండో అవకాశంగా ఈనెల 20 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు. దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ పథకం తొలి విడతగా రూ.7 వేల నగదును సీఎం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. మొత్తం 44.75 లక్షల మంది అర్హులైన రైతులకు ఈ సాయం అందిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కొంత మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదని వారు తెలిపారు. వీరిలో ఈకేవైసీ లోపాలు, ఎన్‌పీసీఐ లో ఖాతాలు మ్యాప్ అవ్వకపోవడం, బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్ గా లేకపోవటం, ఎన్నికల నియమావళి వల్ల నిలిపివేత వంటి సమస్యల కారణంగా నిధులు జమ కాలేదు. దీంతో, వీరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications