అమరావతి భూముల పై అనూహ్య నిర్ణయం - ఏం జరుగుతోంది..!!

రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం తొలి విడత నిధులు విడుదల అయ్యాయి. అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నారు. ఈ నెలలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది. ఇదే సమయంలో అమరావతిలో కొత్త ప్రాజెక్టు పైన నిపుణుల నుంచి నివేదికలు కోరుతోంది. కాగా, అమరావతిలో భూముల విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

కీలక నిర్ణయం
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధానిలో పనులు ప్రణాళికా బద్దంగా అమలు చేస్తూనే.. విస్తరణ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మరో 30 వేల ఎక రాల భూ సమీకరణకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటు అయ్యే ప్రాజె క్టుల కోసం భూమి అవసరమని గుర్తించారు. ఇందు కోసం కోర్ క్యాపిటల్ సమీప గ్రామాల్లో అవస రమైన ఈ 30 ఎకరాల భూ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా భూ సమీకరణ దిశగా కసరత్తు సాగుతోంది.

ap-govt-latest-decision-on-amaravati-lands-amid-works-re-launch

విస్తరణ పనులు
అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులతో పాటుగానే రెండో వైపు విస్తరణకు ప్రణా ళికలు సిద్దం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవలే రూ.31 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను వివిధ ఏజెన్సీలకు సీఆర్డీఏ అప్పగించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా పనుల ఆధారం గా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి. రాజధాని పనులు వేగం అందుకోగానే ఈ విస్తరణపై కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే రాజధానిలో భవిష్యత్ ప్రాజెక్టుల కోసం మరో 30 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Take a Poll

భవిష్యత్ కోసం
తాజా ప్రణాళికల్లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధా నంగా ఈ భూముల సమీకరణకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమీకరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. మరో వైపు అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ టెక్నో ఫీజిబిలిటీ నివేదికను సిద్ధం చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను త్వరితగతిన రూపొందించి కేంద్రానికి పంపనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి దీనిపై గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనుంది. భవిష్యత్ అవసరాల కోసం పూర్తి స్థాయిలో అంచనాలను సిద్దం చేసి ఒకే సారి ఎంత భూమి సమీకరణ చేయాలనే దాని పైన ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+