Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం కొత్త విధానం - ఇక నుంచి, తప్పనిసరిగా..!!

ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల పై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో తెచ్చిన మార్పులతో విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో నకిలీ మద్యం పూర్తిగా అరికట్టేందుకు కీలక విధానం అమల్లోకి తెస్తున్నారు. బెల్టు షాపుల పైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కాగా.. ఇక నుంచి మద్యం బ్రాండ్ .. తయారీ తేదీ.. నెంబర్ తో సహా అమ్మకాల వరకు ప్రతీ సీసాకు నెంబర్ కేటాయించాలని తాజా నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో నకిలీ నివారణ కోసం వినూత్న పద్దతి అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు నకిలీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రతీ సీసా పైన క్యూ ఆర్ కోడ్ ద్వారా వినియోగదారుడు మద్యం క్వాలిటీ తెలుసుకునే అవకాశం ఉంది. కాగా, దేశంలోనే మొదటి సారి ప్రతీ మద్యం సీసా పైన లిక్కర్ ఐడింటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం బ్రాండ్.. తయారీ తేదీ తో పాటుగా సీసాకు నెంబర్ కేటాయిస్తూ ప్రతీ సీసా పైన ముద్రిస్తారు.

AP Govt latest decision over liquor sales and on Revenue targets here the details

ప్రతీ వినియోగదారుడు ఈ నెంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసే విధంగా అవగాహన పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. తాజాగా ఎక్సైజ్ శాఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా.. ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని సూచించారు.

ఇదే సమయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్‌ ఫీజు, లిక్కర్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబరు, రిటైలర్‌ మార్జిన్‌ పెంపు వంటి అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. బార్‌ ఎఆర్‌ఇటి (అడిషనల్‌ రిటెయిల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌) మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సిఎం నిర్ధేశించారు. అక్రమ మద్యాన్ని అరి కట్టడం, బెల్టుషాపుల నియంత్రణ, డిజిటలైజేషన్‌, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రతి మద్యం బాటిల్‌పై ప్రత్యేక గుర్తింపు నెంబరు ఉండాలన్నారు. జియో ట్యాగింగ్‌ ద్వారా మద్యం సరఫరాలో పారదర్శకత వస్తుందని, ట్రాకింగ్‌ షాపుల రేషనలైజేషన్‌పైనా దృష్టి పెట్టాలని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాటిల్‌ తిరిగి ఇస్తే డిఆర్‌ఎస్‌ (డిపాజిట్‌ రిటర్న్స్‌ స్కీమ్‌) కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తు నట్లు చెప్పారు.

2024 అక్టోబరు నుంచి 2025 అక్టోబరు వరకు రూ.8 వేలకోట్లు ఎక్సైజ్‌ ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా, రూ.7,041 కోట్లు ఆదాయం వచ్చినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి డిసెంబరు 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం మెరుగుదల కనిపించిందని, ఐఎంఎఫ్‌ఎల్‌ విక్రయాలు 19.08 శాతం, బీరు విక్రయాలు 94.93 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబరు 18 నాటికి రూ.8,422 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం పెరుగుదల చూపిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+