రేషన్ కార్డు దరఖాస్తు దారుల కోసం కొత్తగా, ఇలా చేయండి..!!

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. జూన్ 7వ తేదీ నుంచి కొత్త కార్డుల మంజూరు చేయాలని నిర్ణయించింది. రైస్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తులతో పాటుగా కార్డుల్లో పేర్ల మార్పులు - చేర్పుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఆన్ లైన్ విధానంలో స్వీకరించాలని తొలుత నిర్ణయించారు. కాగా, సర్వర్ సమస్యలతో పాటుగా సాంకేతిక కారణాలతో వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆన్ లైన్ సేవల ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మన మిత్ర ద్వారా
ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు వాట్సప్ ద్వారా అవకాశం కల్పిస్తామని గతంలోనే ప్రకటించింది. అయితే, ఇది అందుబాటులోకి రాలేదు. దరఖాస్తు దారుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ సేవలను ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది. రైస్‌ కార్డులో మార్పు చేర్పులు, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకునేందుకు మనమిత్ర (వాట్సాప్‌ గవర్నెన్స్‌) సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎనిమిది రకాల సేవలు ఉన్నప్పటికీ, ప్రధానంగా కొత్త రైస్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌ లేదని తెలుస్తోంది. మనమిత్ర ద్వారా దరఖాస్తు విధానం పైన పౌర సరఫరా శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.

ap-govt-launches-ration-cards-services-in-manamitra-app-details-here

దరఖాస్తు ఇలా..
మొబైల్‌ ఫోనులో 'మనమిత్ర' వాట్సాప్‌ చాట్‌లోకి వెళ్లి 'హాయ్‌' అని టైప్‌ చేసి కోరుకున్న 'సేవను ఎంచుకోండి' అని వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే 'పౌర సేవను ఎంచుకోండి' అనే బాక్స్‌లో 'సివిల్‌ సప్లయిస్‌ సేవలు'పై క్లిక్‌ చేయాలి. 'దీపం' స్థితి, రైస్‌ డ్రా స్థితి, రైస్‌ ఈకేవైసీ స్థితి, రైస్‌ కార్డు సమ ర్పణ, రైస్‌ కార్డులో సభ్యులను జోడించడం, రైస్‌ కార్డులో సభ్యులను తొలగించడం, తప్పుగా జోడించిన ఆధార్‌ సీడింగ్‌ సవరణ, రేషన్‌ కార్డ్‌ విభజన దరఖాస్తు.. అనే 8 రకాల సేవలు కనిపిస్తా యి. వీటిలో లబ్దిదారుడుకు అవసరమైన సేవను ఎంపిక చేసుకుని.. వివరాలను పూరించి, వాట్సాప్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

భారీగా దరఖాస్తులు
ప్రభుత్వం కొత్త కార్డులతో పాటుగా మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 7వ తేదీ నుంచి గ్రామ- వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టారు. అంచనాలకు మించి దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని ఆన్ లైన్ చేయటంలో జరుగుతున్న జాప్యం పైన లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రైస్‌ కార్డు దరఖాస్తులు సమర్పించడానికి వీలుగా 'మనమిత్ర' (వాట్సా ప్‌ గవర్నెన్స్‌) సేవలను ఈ నెల 15 నుంచే అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చెప్పిన విధంగా వాట్సప్ సేవలు అందుబాటులోకి రాలేదు. కాగా, లబ్దిదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పుడు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో, దరఖాస్తుదారులకు కొంత వెసులుబాటు కల్పించారు. అయితే ఇందులో కొత్త రైస్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇలాంటి వారంతా తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+