జెత్వానీ కేసులో ఆ ఐపీఎస్ ల పై సస్పెన్షన్ ఎత్తివేత, రెండేళ్ల తరువాత పోస్టింగ్..!?
ఎట్టకేలకు ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ రానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ముంబాయి మోడల్ జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పైన సస్పెన్షన్ వేటు పడింది. వీరి పైన కేసు విచారణ కొనసాగుతోంది. దీంతో.. వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, ఈ కేసులో కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేయటంతో.. ఈ వీరిలో ఇద్దరు అధికారుల పైన సస్పెన్షన్ ఎత్తేవేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు పదవీ విరమణ వేళ ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారనుంది.
ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో రెండేళ్ల కాలంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ పైన సస్పెన్షన్ కొనసాగుతోంది. వీరి పైన త్వరలో ఎత్తివేసే అవకాశం ఉంది. వీరికి పోస్టింగ్స్ ఇస్తారని భావిస్తున్నారు. జెత్వానీ పై అక్రమ కేసు బనాయించి వేధించారంటూ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో నిందితులైన ఈ ఇద్దరిని 2024 సెప్టెంబర్ 15న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న దశలో సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్ష్యులను ప్రభావితం చేయవచ్చని రివ్యూ కమిటీ అభిప్రాయం మేరకు అప్పటి నుంచి వారి సస్పెన్షన్ కొనసాగుతోంది.

రెండేళ్ల తరువాత సస్పెన్షన్ ఎత్తివేత, పోస్టింగ్
అందులో భాగంగా ప్రతీ ఆరు నెలలకు ఒక సారి వీరి సస్పెన్షన్ పొడిగిస్తున్నారు. చివరి సారిగా జారీ అయిన ఉత్తర్వుల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీ వరకు , లేదా కేసు దర్యాప్తు ముగిసే వరకూ ఏది ముందు అయితే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేసారు. దీంతో.. వీరి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇదే కేసులో నిందితుడుగా ఉంటూ సస్పెండ్ అయిన మాజీ నిఘా చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఈ నెల 31వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా ఆయన పై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇస్తారా.. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అనేక కీలక అంశాలను విచారణ అధికారులు వెల్లడించారు. ఇక.. ఇప్పుడు వీరి పైన సస్పెన్షన్ ఎత్తివేస్తే రెండేళ్ల తరువాత ఈ అధికారులు తిరిగి తమ విధుల్లో చేరేందుకు మార్గం సుగమం అవుతుంది.












Click it and Unblock the Notifications