బీసీ సంక్షేమానికి భారీ కేటాయింపులు - ఏ వర్గానికి ఎంత..!!

AP Budget 2025-26: ఏపీ ప్రభుత్వం సంక్షేమ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. 3.22 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేసారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు గా, మూల ధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు గా అంచనా వేసారు. ఇక, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు గా కేశవ్ అంచనాగా వెల్లడించారు.

సంక్షేమ రంగానికి
ఈ బడ్జెట్ లో పలు రంగాలకు ప్రాధాన్యత లభించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించారు. ఇక.. పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు కేటాయించగా.. సంక్షేమ రంగానికి భారీగా నిధులు ప్రతిపాదించారు. అందులో.. ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్ల, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్ప సంఖ్యా క వర్గాల కోసం రూ.5,434 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. అదే విధంగా.. మహిళా శిశు సంక్షే మం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.

AP Govt major allocations for Welfare Sector in 2025-26 Budget

ప్రాధాన్యత రంగాలకు
రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో వ్యూహాత్మకంగా సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు చేసినట్లు స్పష్టం అవుతోంది. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఏకంగా 47,456 కోట్లను కేటాయించింది. ఇక.. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు,పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు ప్రతిపాదించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు కేటాయింపులు చేసారు. పంచాయతీరాజ్‌ శాఖకు రూ.18,847 కోట్లు చేసిన ప్రభుత్వం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు కేటాయించారు. గృహనిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు ప్రతిపాదించారు.

Take a Poll

హామీల కోసం
కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు,
ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు ప్రతిపాదించారు. యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు కేటాయించగా.. గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు ప్రతిపాదించారు. ఈ సారి ప్రత్యేకంగా తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు కేటాయించారు. అదే విధంగా మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు. కీలక హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, పోలవరం కోసం రూ.6,705 కోట్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కోసం రూ.2800 కోట్లు, తల్లికి వందనం అమలు కోసం రూ.9,407 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+