అసెంబ్లీలో స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు బిల్లు-ఉద్యోగాలు, ప్రమోషన్లపై క్లారిటీ..!
ఏపీలో వైసీపీ హయాంలో తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్దను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం (ap govt) గత 20 నెలల కాలంలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా సచివాలయాల పేర్లను కూడా మార్చింది. అయితే వీటిపై చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండటంతో ఇవాళ అసెంబ్లీలో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారుస్తున్నట్లు మంత్రి డీబీవీ స్వామి తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మార్పు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి డిఎస్ బీవీ స్వామి .. అనంతరం దీని ఉద్దేశాన్ని వివరించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ద్వారా స్ధానిక యువత నైపుణ్యాలు గుర్తించి, వర్క్ ప్రం హోం, జీవనోపాధిని కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

మరోవైపు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి మరోసారి ప్రకటించారు. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్ధ తీసుకొచ్చినట్లు తెలిపారు. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాలకు స్టేషనరీ, ఇంటర్నెట్ ఖర్చులకు ప్రతి నెలా రూ.1000 చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో లోప భూయిష్టంగా ఉన్న వ్యవస్ధను కూటమి ప్రభుత్వంలో పటిష్టంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications