'తల్లికి వందనం' నిధుల విడుదల పై తాజా నిర్ణయం, అర్హుల జాబితా- కీలక మార్పు..!!

ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతీ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం వేళ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు... నిధుల విడుదల చేస్తోంది. ఈ ఏడాది 12న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తల్లికి వందనం నిధుల విడుదల పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో లబ్ది దారులకు కీలక సూచనలు చేసారు. "తల్లికి వందనం" పథకాన్ని అమలు చేస్తూ ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థుల వరకు వారి తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.13 వేలు, పాఠశాల అభివృద్ధికి రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ ఏడాది 12వ తేదీ వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా.. ఈ నెల 19వ తేదీన తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 20న నిధులు జమ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి విద్యా శాఖ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా, ఇదే సమయంలో లబ్ది దారులకు కీలక సూచనలు చేస్తున్నారు.

 గృహ వినియోగ వంట గ్యాస్ ధర భారీగా పెంపు, నేటి నుంచే అమలు..!!
గృహ వినియోగ వంట గ్యాస్ ధర భారీగా పెంపు, నేటి నుంచే అమలు..!!
ap-govt-planning-for-release-thalli-ki-vandanam-funds-in-the-beneficiaries-accounts-on-20th-of-this

అర్హుల జాబితా.. కీలక సూచనలు

ప్రభుత్వం అర్హుల జాబితా ప్రటించిన తర్వాత లింకు వస్తుంది. స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బందిని సంప్రదించి పూర్తి సమాచారం పొందే వెసులుబాటు కల్పించారు. తల్లికి వందనం పథకం డబ్బులు జమ కావాలంటే ఆధార్‌ అనుసంధానం తప్పని సరని అధికారులు చెబుతున్నారు. గత విద్యా సంవత్సరం ఆధార్ అనుసంధానం చేయని కారణంగా పలువురి ఖాతాల్లో నిధుల జమ ఆలస్యం అయింది. దీంతో.. ఈ సారి ముందస్తుగానే లబ్దిదారులు తమ వివరాల పైన స్పషత తీసుకోవాలని సూచిస్తున్నారు. ముందుగానే అన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవడం మంచిదని చెబుతున్నారు. ముందుగా బ్యాంకు ఖాతా ఉన్న శాఖను సంప్రదించి మనుగడలో ఉందో, లేదో చెక్ చేసుకోవాలని సూచన చేస్తున్నారు. కేవైసీ సహా ఏదైనా సమస్య ఉంటే సంబంధిత పత్రాలతో అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతా వివరాలు, సెల్​ ఫోన్ నంబర్‌తో పాటు అవసరమైన సమాచారం నమోదు చేయడం తప్పనిసరి చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+