మహిళల ఖాతాల్లోకి రూ 1500 - బీసీ, కాపులకోసం ఇలా..!!

కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ సమయంలో ఎన్నికల హామీల దిశగా కసరత్తు చేస్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నిధి పైన కూటమి నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో ఈ హామీ అమలు దిశగా చర్చ జరుగుతోంది. అదే విధంగా బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు...కాపు భవనాల పూర్తి పైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది.

కసరత్తు
ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు మొదలు పెట్టింది. సూపర్ సిక్స్ హామీల అమలు పైన మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. నేటి కేబినెట్ లో మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైనా చర్చ జరుగనుంది. గతంలో ఈ మొత్తం 3 లక్షలు గా మాత్రమే ఉండేది. నేటి సమావేశంలో రుణాల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

AP Govt planning to impelement Adabidda Nidhi soon as Election promise

రిజర్వేషన్లు
అదే విధంగా ప్రభుత్వం చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా పయనిస్తోంది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల అంశానికి ఆమోద ముద్ర వేయనున్నారు. గతంలో అమలైన ఎన్టీఆర్‌ విదేశీవిద్య, విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలని కూడా సీఎం చంద్రబాబు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లబ్ధిదారులుగా ఉన్న పథకాల నిబంధనల్లో మార్పులు చేయాలని, ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా నిబంధనలు సవరించాలని నిర్ణయించారు.

కాపు భవనాలు
26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌ నిర్మాణాలు చేపట్టాలని, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 56 బీసీ కార్పొరేషన్లను పునర్‌ వ్యవస్థీకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కులాలు, ఉప కులాల వారీకా కార్పొరేషన్ల పునర్ వ్యవస్థీకరణ ఉండాలన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 68 కాపు భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న రెండు భవనాల నిర్నాణానికి రూ 2.36 కోట్ల విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+