వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి: బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం సీరియస్..!

|
Google Oneindia TeluguNews

ఉల్లిని కొనాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా మార్కెట్ లో అనూహ్యంగా పెరుగుతన్న ఉల్లి ధరలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ 60 కు పైగా చేరింది. దీని పైన సాధారణ ప్రజల ఫిర్యాదులతో ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా మంత్రి మోపిదేవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణాలపైన మంత్రి ఆరా తీసారు. ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిరంగా వ్యవహరించాలని స్పష్టం చేసారు.

Recommended Video

Onion Prices Double In A Week In Hyderabad || అనూహ్యంగా పెరుగుతన్న ఉల్లి ధర || Oneindia Telugu

ప్రజలకు ఉల్లి కన్నీరు..
భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. ఇదే అదనుగా వ్యాపారులు ఉల్లిని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. సాధారణంగా ఏపీలో కర్నూలు నుండి భారీగా ఉల్లి దిగుబడి ఉంటుంది. మహారాష్ట్ర నుండి సైతం దిగుమతి చేసుకొని వ్యాపారులు అమ్ముకోవటం ఇక్కడ సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే..ఇప్పుడు కర్నూలులో పూర్తిగా దిగుబడి తగ్గిపోయింది.

AP Govt serious onion blak marketing creating temporary shortage for high rtes

దీంతో..కిలో ఉల్లి ధర ఏకంగా రూ 60కు పైగా చేరింది. దీంతో.. సాధారణ ప్రజలు ఉల్లి కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. మార్కెంటింగ్ శాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధర పెరగటానికి కారణాల పైన విశ్లేషించారు. బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారం పైన వివరాలు సేకరించారు. తక్షణం చేపట్టాల్సిన చర్యల పైన సూచనలు చేసారు.

మంత్రి మోపిదేవి సీరియస్
ఉల్లిని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంటే మార్కెటింగ్ అధికారులు ఏం చేస్తున్నారంటూ మంత్రి సీరియస్ అయ్యారు. దీంతో..అధికారులు బయట ఉన్న పరిస్థితిని మంత్రికి వివరించే ప్రయత్నం చేసారు. ఇతర ప్రాంతాల్లో నెలకొన్న డిమాండ్ కు అనుగుణంగా రైతులు ఇష్టానుసారం ధరలు పెంచేసారని అదికారులు నివేదించారు. భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయిందని..ఫలితంగా ఉన్న సరుకును సొమ్మ చేసుకొనేందుకు వ్యాపారులు బహిరంగ మార్కెట్ లో ఉల్లి కృత్రిమ కొరతకు కారణమయ్యారంటూ అధికారులు వివరించారు.

దీంతో..మంత్రి మోపిదేవి సైతం పరిస్థితిని అనువుగా మార్చుకుని కొంత మంది కృత్రిమ కొరత సృష్టించారన్న విషయం తన దృష్టికి వచ్చిందని వివరించారు. బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి ఆదేశించారు. మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర నుంచి ఉల్లిని తెప్పించి రైతు బజార్లలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.

English summary
AP Govt serious on Onion blak marketing in retail sector. Mininster mopidevi ordered official to control blak marjet and take serious action against who ever involved in this. suggested to import onion from maharastra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X