ఏపీలో అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తులపై గుడ్ న్యూస్-సర్కార్ కీలక ఉత్తర్వులు..!

ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ హక్కుల మంజూరు కోసం చేసుకునే దరఖాస్తుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఫ్రీహోల్డ్ హక్కుల కోసం వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్ భూములు, చుక్కల భూములు, గ్రామాల్లో ఇనాం భూములు, పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరు ప్రక్రియలో దరఖాస్తుల పరిష్కారానికి గడువులను పెట్టింది.

నిన్న విజయ్, ఇవాళ డీకే శివకుమార్- చంద్రబాబు అడగ్గానే కాదనకుండా..!
నిన్న విజయ్, ఇవాళ డీకే శివకుమార్- చంద్రబాబు అడగ్గానే కాదనకుండా..!

ఆయా భూముల ఫ్రీహోల్డ్ హక్కుల కోసం వచ్చే దరఖాస్తుల్ని ఆర్డీవోలు 60 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం గడువు విధించింది.
దరఖాస్తులు అందిన రోజే ఆన్ లైన్ విధానంలో సంబంధిత తహసీల్దార్ కు పంపించాలని, ఆయన వాటిని 60 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. లేదా తహసీల్దార్ నివేదిక అందిన వెంటనే 60 రోజుల గడువు ముగిసేలోపు సదరు దరఖాస్తును ఆర్డీవో లాగిన్ కు పంపించాలని సూచించింది. ఆర్డీవో లాగిన్ కు చేరిన తర్వాత మాత్రం 30 రోజుల్లో వాటిని పరిష్కరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

AP Govt Sets 30- and 60-Day Deadlines for Assigned Land Freehold Application
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!

2023 నాటి భూ హక్కుల సవరణ చట్టం ప్రకారం ఓ భూమికి ఫ్రీహోల్డ్ హోదా కల్పించి, వెబ్ ల్యాండ్ లో నమోదు చేసినట్లయితే, దానికి రిజిస్ట్రేషన్ ను అనుమతించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖలోని పీడీఈ మాడ్యూల్ ను వాడాలని సూచించింది. దీన్ని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే ఫ్రీహోల్డ్ చర్యలు లేదా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఉత్తర్వుల్ని సంబంధిత వ్యక్తులు రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. వెబ్ ల్యాండ్ లో ఉన్న స్దితి ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలని సూచించింది. అయితే రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ సమయంలో వెబ్ ల్యాండ్ ఏపీఐ ద్వారా పొందిన భూమి స్దితిని రికార్డుల్లో భద్రపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా వెబ్ ల్యాండ్ లో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించింది. ఫ్రీహోల్డ్ భూముల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గించడంతో పాటు ఆన్ లైన్ ప్రక్రియ వేగవంతం చేయడం, రిజిస్ట్రేషన్లలో సమస్యలు తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+