రిగ్గింగ్ అనేదానికి కూటమి ప్రభుత్వం కొత్త నిర్వచనం చెప్తోంది: వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!
రిగ్గింగ్ అనేదానికి కొత్త నిర్వచనం కూటమి ప్రభుత్వం చెబుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నామినేషన్లలో రిగ్గింగ్, ఎన్నికల్లో రిగ్గింగ్ అంటూ కూటమి సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. రిగ్గింగ్ చేయడంలో సౌత్ బీహార్ ను మరిపించిన ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, జనాల్లో మద్దతు కనిపించక, గెలిచే సత్తా లేక, బూత్ క్యాప్చరింగ్‌లు చేస్తున్నారన్నారు.
దొంగ ఓట్లతో గెలవాలని చూడటం కూటమి పార్టీలకు నిజంగా సిగ్గుచేటు అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ అభివృద్ధి బలం కాదు.. ఓటమి భయానికి పరాకాష్ట అని షర్మిల తేల్చి చెప్పారు . ఎన్నికల సంఘాన్ని బానిస చేసి, ప్రజల తీర్పును అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని చంపిన తీరు దేశ ఎన్నికల చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయం అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

నిజంగా ప్రజాబలమే ఉంటే రిగ్గింగ్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ? అంటూ ప్రశ్నించారు. ఒకవైపు ప్రజాస్వామ్యం, పారదర్శకత అని నీతులు చెబుతూ మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టి ఎన్నికల వ్యవస్థను శాసించడం, విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన పారదర్శకత? చెప్పాలని నిలదీశారు. నామినేషన్లు వేయకుండా, ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఎక్కడి ప్రజాస్వామ్యం అన్నారు.
ప్రశాంతతో కాదు.. రాష్ట్రంలో భయానక వాతావరణంలో జరిగిన ఎన్నికలు ఇవి అని షర్మిల అభిప్రాయపడ్డారు. ఎటు చూసినా దాడులు.. దౌర్జన్యాలు..అని మండిపడిన షర్మిల ఇదొక గెలుపు అంటారా? ఇదా ఎన్నికలు నిర్వహించే తీరు ? అంటూ అసహనం వ్యక్తం చేశారు.కూటమి అరాచకాలపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు వైఎస్ షర్మిల.
బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు మరియు దౌర్జన్యాలు జరిగినట్లు ఆధారాలు వీడియోలు, ఫొటోలు ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో ..తక్షణమే పోలింగ్‌ను రద్దు చేసి, రీ-పోలింగ్ నిర్వహించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్‌కాస్టింగ్ మరియు సీసీటీవీ ఫుటేజ్‌లను నిష్పక్షపాతంగా స్క్రీనింగ్ చేయాలన్నారు. ఓటరు కాకుండా ఇతరులు పదే పదే లోపలికి వెళ్లినట్లు లేదా ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఫుటేజ్‌లో తేలితే ఆయా బూత్‌ల ఫలితాలను నిలిపివేయాలన్నారు.
అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, అక్రమాలను చూస్తూ ఊరుకున్న రిటర్నింగ్ అధికారులు , ప్రిసైడింగ్ అధికారులు మరియు పోలీసులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
