కేసీఆర్ ఫాంహౌస్‌లో అసైన్డ్ భూములు గుర్తింపు..? రేవంత్ చేతికి అస్త్రం..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేతల ఫాం హౌస్ ల పైన కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ఫాం హౌస్ పైన సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన చేసారు. అందులో అసైన్డ్ భూములు ఉన్నట్లుగా తేల్చారని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో... ప్రభుత్వానికి రెవిన్యూ అధికారులు పూర్తి నివేదిక సమర్పించనున్నారు. దీంతో.. ఇప్పుడు రేవంత్ నిర్ణయం కీలకంగా మారుతోంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో అసైన్డ్ భూములు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. పరిసరాల్లోని సర్వే నంబర్ 325లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి మరియు అసైన్డ్ భూముల రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వే నంబర్ 325లో ఉన్న ప్రభుత్వ గైరాన్ భూములు, అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై రెవెన్యూ యంత్రాంగం పూర్తి నివేదిక సిద్దం చేస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి, సమీప శివారు వెంకాపురం గ్రామాల్లో గత మూడు రోజులుగా భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సర్వే ద్వారా ప్రభుత్వ భూముల హద్దులను స్పష్టంగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో కేసీఆర్ ఫాంహౌస్ పరిధిలో సుమారు 10 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా, దళితులకు కేటాయించాల్సిన ఈ భూములను కొందరు అన్యక్రాంతం చేసుకుని, ఫాంహౌస్‌ అవసరాల కోసం నీటి వనరుల నిర్మాణానికి ఉపయోగించినట్లు తేలినట్లు సమాచారం.

 దానం తరువాతి వికెట్ ఆయనే, అధారాలు పక్కా..? కేసీఆర్ ఫిక్స్..!!
దానం తరువాతి వికెట్ ఆయనే, అధారాలు పక్కా..? కేసీఆర్ ఫిక్స్..!!
kcr-erravelli-farmhouse-revenue-survey-finds-assigned-land-water-source-and-large-parcels-in-poss

రెవిన్యూ అధికారుల నివేదికతో

అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన చేసిన తరువాత అధికారులు వేగంగం స్పందించారు. అందులో భాగంగా భూ ఆక్రమణలపై సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సర్వే నంబర్ 325 పరిధిలోని సుమారు 388.05 ఎకరాల గైరాన్ భూమి ఆక్రమణలను గుర్తించి, సంబంధిత భూయజమానులకు గత వారంలోనే 180 నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించాల్సిన భూయజమానులు ఇవాల్టి నుంచి తమ పత్రాలతో అధికారుల ముందు హాజరవుతున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇతర చట్టబద్ధమైన పత్రాలను సమర్పిస్తే పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ రాకతో రికార్డులు తారుమారయ్యాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఎర్రవల్లి, శివారు వెంకాపురం గ్రామాల మధ్య సర్వే నంబర్లు, భూ రికార్డుల్లో తీవ్రమైన లొసుగులు, ఓవర్‌లాపింగ్ ఉన్నాయని మర్కూక్ తహశీల్దార్ సరితకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక.. ఇప్పుడు రెవిన్యూ అధికారులు ఇచ్చే నివేదిక కీలకంగా మారుతోంది. అసైన్డ్ భూములు గుర్తిస్తే సీఎం రేవంత్ చేతికి అస్త్రం అందించినట్టే అనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+