భీమ్లానాయక్ కు ప్రస్తుత ధరలేనా..!! కమిటీ నివేదిక సిద్దం..కానీ : పైనల్ డెసిషన్ ఇదే..!!

ఏపీలో సినిమా టికెట్ ధరలతో పాటుగా..ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల పైన అధ్యయన నివేదిక సిద్దమైంది. టికెట్ ధరలు పెంచాలనే డిమాండ్ తో పాటుగా.. థియేటర్ల నిర్వహణ పైన ఏపీ ప్రభుత్వం కమిటీ నియమించింది. ఇదే సమయంలో సినీ ప్రముఖులతోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు. అటు సినీ పరిశ్రమకు...ఇటు ప్రజల పైన భారం లేకుండా టికెట్ ధరలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇక, ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ రోజు చివరి సమావేశం నిర్వహించింది. ఈ కమిటీలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో 13 మంది సభ్యులున్నారు.

సినిమా పరిశ్రమ కోరుకున్న విధంగానే

సినిమా పరిశ్రమ కోరుకున్న విధంగానే


వారిలో పలు విభాగాల ఉన్నతాధికారులు,థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. రెండు లేదా మూడు రోజుల్లో సీఎం జగన్ కు కమిటి నివేదిక అందించనుంది. ధరలు పెంపు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు స్పష్టం చేసారు. సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులతో సీఎం జగన్ చర్చల వివరాలు ఈ కమిటీ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. వారంలోగా ప్రభుత్వం నుంచి అధికారికా టికెట్ల ధరల పెంపు పైన నిర్ణయం వెలువడుతుందని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు భావిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఇచ్చిన రేట్ల ప్రతిపాదనలకు దగ్గరగా టిక్కెట్ రేట్లు ఉంటాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్న విధంగానే నాలుగు కేటగిరీలు, మూడు రకాల థియేటర్లు కొనసాగించనున్నారు. సుళ్లూరు పేట వంటి ప్రాంతాల్లో ఉండే మల్టీప్లెక్సులకు ప్రత్యేక రేట్లు ఉంటాయి.

వారం రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం

వారం రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం

అయితే, కమిటీ సభ్యులు ఈ నెల 20వ తేదీ లోగా పెంచిన టికెట్ ధరల జీవోలు జారీ అయ్యేలా చూడాలని కోరారు. పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.. వెంటనే జీవోలు ఇవ్వాలని సూచించారు. నిమా టికెట్ల ధరల నిర్ణయానికి స్లాబులపై చర్చ జరిగింది. మేకింగ్ మని రూ. 100కోట్లు దాటితే స్పెషలైజ్డ్ గా పరిగణించే అంశంపై పై చర్చ జరిగింది. అయిదో షో ప్రదర్శన పైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదయం 8 గంటల తరువాత ప్రారంభించి రాత్రి లోగా అయిదు షో లు ప్రదర్శనకు వీలుగా సమయాలు నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు. షోల ప్రదర్శనలో చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక, కమిటీ సంబంధించి ..మళ్లీ సమావేశం ఉండొచ్చు ఉండకపోవచ్చని చెప్పుకొచ్చారు. టికెట్ల ధరల నిర్ణయానికి థియేటర్లలో మూడు స్లాబులు ఉంటాయని వెల్లడించారు.

సీఎంకు నివేదిక.. ఉత్తర్వుల జారీ పెండింగ్

సీఎంకు నివేదిక.. ఉత్తర్వుల జారీ పెండింగ్

అయితే, రెండు రోజుల్లో సీఎంకు నివేదిక.. ఆ తరువాత జీవోల జారీకి మొత్తంగా వారం రోజుల సమయం పడుతుందని కమిటీలోని సభ్యులు అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ నెల 25న పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా..కరోనా కారణంగా వాయిదా పడింది. తిరిగి రిలీజ్ డేట్ ప్రకటించే సమయంలోనూ రెండు డేట్స్ ను సిద్దం చేసుకున్నారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు ఖాయమనే సంకేతాలు అందుతున్నా..అది అధికారికంగా జీవోలు జారీ కావటానికి మరో వారం సమయం పడుతుందని చెబుతున్నారు.

భీమ్లా నాయక్ కలెక్షన్లపై ప్రభావం పడేనా

భీమ్లా నాయక్ కలెక్షన్లపై ప్రభావం పడేనా

25న విడుదలయ్యే సినిమాకు ముందస్తుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. దీంతో... టికెట్ ధరలు పెరిగినా ఆ నిర్ణయం భీమ్లానాయక్ మూవీ విడుదల తేదీ నాటికి అమల్లోకి వస్తుందా రాదా అనే చర్చ మొదలైంది. సినిమా తొలి వారానికి సాధ్యం కాకపోయినా.. రెండో వారం నుంచి పెరిగిన టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదే సమయంలో అయిదో షో ప్రదర్శనకు సైతం ఇదే సమయంలో అధికారికంగా అనుమతి లభిస్తే..ఈ సమస్యకు...రాజకీయ వివాదం సమిసిపోయినట్లే. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయాలు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తుందనేదే..ఆ టైం ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+