గౌతమిపుత్ర శాతకర్ణిపై కేబినెట్ చర్చ: లేచి వెళ్లిపోయిన చంద్రబాబు..
తమ మధ్య ఉన్న బంధుత్వం ప్రభావం కేబినెట్ చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో జరిగిన ఈ భేటీలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' పన్ను మినహాయింపు అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే ఈ చర్చ సందర్బంగా సీఎం చంద్రబాబు సమావేశం నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
'గౌతమిపుత్ర శాతకర్ణి' హీరో బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడం, పైగా బాలకృష్ణకు చంద్రబాబుకు బంధుత్వం ఉండటంతో.. ఆ ప్రభావం చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాకు పన్ను మినహాయింపునిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

సెక్షన్-8 ప్రకారం సినిమాకు పన్ను రాయితీనిస్తూ కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.
కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 638 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం
* పోలవరం సబ్ కాంట్రాక్టర్ అయిన ఎల్అండ్‌టీ కంపెనీకి రూ.95 కోట్లను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు ఆమోదముద్ర
* అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం
* ఏపీ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయం.
*గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో వినోదపన్ను మినహాయింపు












Click it and Unblock the Notifications