సచివాలయాలపై తాజా నిర్ణయం - మళ్లింపు, బదిలీలు..!!
సచివాలయాల వ్యవస్థ పూర్తి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలులో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. వాలంటీర్లు సైతం సచివాలయాల పరిధిలో పని చేసే వారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల బాధ్యతలను ఆర్జీజీఎస్ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. సచివాలయ వ్యవస్థలో మార్పులతో పాటుగా సిబ్బంది బదిలీల పైన అధికారుల కసరత్తు కొనసాగుతోంది.
ప్రభుత్వం కసరత్తు
సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. రెండు వ్యవస్థలను కొనసాగిస్తూనే మార్పులు చేస్తామని చెబుతోంది. అయితే, ఇప్పుడు కీలకమైన సంక్షేమ పథకాల నిర్వహణ బాధ్యతల నుంచి సచివాలయాలను తప్పించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్టీజీఎస్ కు బాధ్యతలు గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల నిర్వహణ..పంపిణీ పూర్తిగా సచివాలయ - వాలంటీర్ల పరిధిలో నిర్వహించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల సేవల పైన తుది నిర్ణయం తీసుకోలేదు.

ఆర్టీజీఎస్ కు అప్పగింత
ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల బాధ్యతల్లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సచివాలయాలు పర్యవేక్షించిన సంక్షేమ పథకాల నిర్వహణను ఇక నుంచి ఆర్టీజీఎస్ కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆర్టీజీసీఎస్ వ్యవస్థ తీసుకొచ్చారు. రాష్ట్రంలోనీ ప్రతీ ప్రాంతంతోనూ ఈ వ్యవస్థ అనుసంధానం అయి ఉంది. క్షేత్ర స్థాయిలో విపత్తుల నుంచి సాయం వరకు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదించేది.
సిబ్బంది బదిలీలు
ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల బాధ్యతలను సచివాలయ వ్యవస్థ నుంచి తప్పించి ఆర్టీజీఎస్ కు అప్పగించేలా కసరత్తు చేస్తోంది. ఆర్టీజీఎస్ ను మరిత బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీంతో, సచివాలయాల కొనసాగింపు వాటి బాధ్యతల పైన చర్చ మొదలైంది. సచివాలయ వ్యవస్థను పంచాయితీ రాజ్ శాఖలో విలీనం చేస్తారనే ప్రచారం ఉంది. ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం సచివాలయ శాఖ కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు పై ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications